Funny Video: జరగాలని ఉంటే జరిగిపోతుందంతే.. ఈ క్రికెట్ మ్యాచే ఇందుకు నిదర్శనం..
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:46 AM
ఓ క్రికెట్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న తమాషా సంఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. బ్యాట్స్‌మన్ బంతిని బౌండరీ దాటించాలని బలంగా కొడతాడు. అయితే మధ్యలో ఉన్న ఫీల్డర్ దాన్ని అడ్డుకుంటాడు. దీంతో..

‘‘ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది.. మనం అనుకున్నమాత్రాన సరిపోదు’’.. అని పెద్దలు అంటుంటారు. కొన్నిసార్లు మనం ఎన్ని అనుకున్నా పనులు సక్రమంగా జరగవు. అదే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా మనం అనుకున్నవి చకచకా జరిగిపోతుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన పాత వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘జరగాలని ఉంటే జరిగిపోతుందంతే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ క్రికెట్ మ్యాచ్‌లో (cricket match) చోటు చేసుకున్న తమాషా సంఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. బ్యాట్స్‌మన్ బంతిని బౌండరీ దాటించాలని బలంగా కొడతాడు. అయితే మధ్యలో ఉన్న ఫీల్డర్ దాన్ని అడ్డుకుంటాడు. దీంతో అప్పటిదాకా ఎంతో ఆశగా ఉన్న బ్యాట్స్‌మన్ కాస్తా.. ఒక్కసారిగా నిరాశకు గురవుతాడు.
Funny Viral Video: ఓపిక లేని మహిళ.. లిఫ్ట్ వద్ద చేసిన నిర్వాకం చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఫోర్ కొట్టే ఛాన్స్ మిస్ అయ్యిందని అనుకుంటాడు. అయితే తానుకొటి తలిస్తే.. దైవం మరోటి తలిచినట్లు.. వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. బంతి బౌండరీకి వెళ్లకుండా అడ్డుకున్న వ్యక్తి పట్టుకునే క్రమంలో కిందపడిపోతాడు. అయినా బంతిని బౌలర్ వైపు విసిరేందుకు ప్రయత్నిస్తాడు. అయితే బంతిని విసిరేయగా.. అది తన కాలికే తగులుకుని దూసుకెళ్లిపోయి బౌండరీ దాటేస్తుందన్నమాట.
ఇలా ఆ బంతి అనుకోని పరిస్థితుల్లో బౌండరీ చేరుకుని, నాలుగు రన్‌లను అందిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జరగాలని రాసి ఉంటే జరిగిపోతుందంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదో జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా లైక్‌లు, 3.36 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కప్పే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది.. ఈ పాము పరిస్థితి చూస్తే..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..