Viral Video: బర్త్ డే యువతికి షాక్.. కేక్ కట్ చేయాలని చూడగా.. చివరకు జరిగిందిదీ..
ABN , Publish Date - Feb 22 , 2025 | 01:57 PM
ఓ యువతి తన పుట్టిన రోజు సందర్భంగా అందంగా ముస్తాబై వస్తుంది. బెలూన్లతో అలంకరించిన ప్రాంతంలో నిలబడి ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. ఆ తర్వాత కేక్ చేతిలోకి తీసుకుని కెమెరాకు ఫోజులు ఇస్తుంటుంది. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. అలాగే మరికొన్నిసార్లు సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి ఎదురైన షాకింగ్ అనుభవానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుట్టిన రోజు జరుపుకొంటున్న యువతి.. కేక్ కట్ చేయాలని చూడగా చివరికి ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన పుట్టిన రోజు సందర్భంగా అందంగా ముస్తాబై వస్తుంది. బెలూన్లతో అలంకరించిన ప్రాంతంలో నిలబడి ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. ఆ తర్వాత కేక్ చేతిలోకి తీసుకుని కెమెరాకు ఫోజులు ఇస్తుంటుంది. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
Farming Viral Video: ఇది కదా తెలివంటే.. క్యారెట్లను కడిగేందుకు ఈ రైతు చేసిన పని చూడండి..
గాల్లో ఎగురుతున్న బెలూన్.. చివరకు కేక్‌పై ఉన్న కొవ్వొత్తులను తాకుతుంది. అలా తాకగానే ఒక్కసారిగా (balloon burst and caught fire) బెలూన్ పేలిపోయి పెద్ద ఎత్తున మంట పుడుతుంది. మంట ముఖానికి తగలడంతో యువతి కేకలు పెడుతూ కేక్ విసిరేసి, అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా సంతోషంగా పుట్టిన రోజును జరుపుకోవాలని చూడగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Marriage Funny Video: చెడగొట్టారు కదరా.. జ్యూస్‌లో మందు కలిపి వరుడికి ఇవ్వడంతో.. చివరకు..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది చూస్తుంటే.. బెలూన్లను వాడాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 1.57 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: ఓపిక లేని మహిళ.. లిఫ్ట్ వద్ద చేసిన నిర్వాకం చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..