Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..
ABN , Publish Date - Feb 23 , 2025 | 09:00 AM
ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కుక్క ఇంటి కిటికీ నంచి బయటికి వచ్చి వేలాడుతోంది. దాని అరుపులు విని చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

సాటి మనిషి కష్టాల్లో ఉంటే చూసి సంతోషించే వారే గానీ.. సాయం చేసే మనుషులు కనిపించని రోజులివి. సాయం చేయకపోగా సమస్యల్లోకి నెట్టేసి వేడక చూస్తుంటారు. అయితే ఇలాంటి సమాజంలోనూ కొందరు మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపిస్తుంటారు. సాటి మనుషుల పట్లే కాకుండా జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. ప్రేమ చూపించడమే కాకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ వాటి ప్రాణాలను కాపాడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న కుక్కను ఓ మహిళ కాపాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బ్రెజిల్‌లో (Brazil) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ కుక్క ఇంటి కిటికీ నంచి బయటికి వచ్చి వేలాడుతోంది. దాని అరుపులు విని చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. కొందరు మహిళలు వారి వారి ఇంటి కిటికీల నుంచి కుక్కను గమనిస్తున్నారు.
Farming Viral Video: ఇది కదా తెలివంటే.. క్యారెట్లను కడిగేందుకు ఈ రైతు చేసిన పని చూడండి..
అయితే వారిలో ఓ మహిళ ఎలాగైనా కుక్కను కాపాడాలనే ఉద్దేశంతో పెద్ద అట్ట పెట్టెను తీసుకుని, కిటికీ బయట పట్టుకుంది. ఆమె ఉంటున్న పైఅంతస్తు కిటికీకి వేలాడుతున్న కుక్క.. కిందపడకుండా చాలా సేపు డోరును పట్టుకుని వేలాడింది. అయితే చివరకు ఒక్కసారిగా పైనుంచి జారిపోయి.. సరిగ్గా మహిళ చేతిలోని (woman caught dog with cardboard box) అట్ట పెట్టెలో పడిపోయింది. దీంతో ఆ కుక్క క్షేమంగా బయటపడింది.
Tiger And Bull Video: ఎద్దుపై పులి ఊహించని దాడి.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..
ఈ ఘటనను చూసి చుట్టుపక్కల వారు చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈమె చేసిన పనికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘సమాజాంలో ఇలాంటి వారిని చూసి మిగతా వారు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2800కి పైగా లైక్‌లు, 2.27 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఏనుగుల పంట పండిందిగా.. రోడ్డుపై నారింజ పండ్ల ట్రక్కు ఆగిపోవడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..