Cricket Bats: పురుషులు, మహిళల క్రికెట్ బ్యాట్లలో తేడాలు.. వీటి వెనుక ఉండే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా..
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:53 PM
పురుషులు, మహిళా క్రికెట్‌లో వినియోగించే బ్యాట్లలో కొన్ని తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీసీసీఐ, ఐసీసీ నిబంధనల మేరకు వారి బ్యాట్లను తయారు చేస్తారట. ఈ బ్యాట్లలోని ఉండే వ్యత్యాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే ఆటకూ లేదంటే అతిశయోక్తికాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అంతా జెంటిల్‌మెన్ గేమ్‌ను ఇష్టపడుతుంటారు. మరోవైపు పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ ఆట ఆటేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. పురుషులు, మహిళా క్రికెట్‌లో ఎలాంటి తేడాలు లేకున్నా.. వారు ఉపయోగించే బ్యాట్లలో మాత్రం కొంత వ్యత్సాసం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పురుషులు, మహిళా క్రికెట్‌లో వినియోగించే బ్యాట్లలో కొన్ని తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బీసీసీఐ, ఐసీసీ (BCCI, ICC) నిబంధనల మేరకు వారి బ్యాట్లను తయారు చేస్తారట. పురుషులు వాడే బ్యాట్ కంటే మహిళలు వినియోగించే బ్యాట్ల బరువు తక్కువగా ఉంటుందట. పురుషుల బ్యాట్ల బరువు 1కిలో 200 గ్రాములు ఉండగా.. మహిళల బ్యాట్లు 1 కిలో 100 గ్రాముల బరువు ఉంటుంది.
ఈ రెండు బ్యాట్లను ఒకే యంత్రంలో తయారు చేసినా కూడా.. నిబంధనలను (Differences in men's and women's cricket bats) అనుసరించి వాటిలో చిన్న మార్పులు చేస్తారు. ఇక బ్యాట్ల పొడవు విషయానికొస్తే.. పురుషుల బ్యాట్ల పొడవు 38 అంగుళాలు ఉంటుంది. అలాగే మహిళ బ్యాట్లు 33 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసి రెండు రకాల బ్యాట్లను తయారు చేస్తారని తెలిసింది.
ఇక బ్యాట్ల నాణ్యత విషయానికొస్తే.. అంతా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లో తయారయ్యే వాటినే ఇష్టపడతారట. ఐపీఎల్‌లో ఆడే మహిళా క్రికెటర్లు కూడా ఈ బ్యాట్లనే వినియోగిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా త్వరలో ప్రారంభం కానున్న పురుషుల ఐపీఎల్‌లో కూడా మీరట్ బ్యాట్లనే వినియోగించనున్నారు. ఇలా చిన్న చిన్న తేడాలతో పురుషులు, మహిళల బ్యాట్లను తయారు చేస్తారన్నమాట.