Poori Making Video: పూరీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఇతనెలా సింపుల్‌గా చేసేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Feb 27 , 2025 | 09:56 AM
ఓ వ్యక్తి పూరీలను విచిత్రంగా చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. గోధుమ పిండిని ఉండలుగా చేసుకుని, పాన్‌లో నూనె వేడి చేశాడు. ఆ తర్వాత పూరీని రోల్ చేసి అందులో వేయాలి. అయితే ఇతను ఇక్కడే విచిత్రంగా ప్రవర్తించాడు..

వంటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో చిత్రవిచిత్ర రెసిపీలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరైతే పెద్దగా కష్టపడకుండా తెలివిగా ఆలోచిస్తూ వంట చేసేస్తుంటారు. ఇంకొందరు వింత వింత టెక్నిక్‌లతో వంట చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పూరీ చేసే విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పూరీని ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పూరీలను విచిత్రంగా చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. గోధుమ పిండిని ఉండలుగా చేసుకుని, పాన్‌లో నూనె వేడి చేశాడు. ఆ తర్వాత పూరీని రోల్ చేసి అందులో వేయాలి. అయితే ఇతను ఇక్కడే విచిత్రంగా ప్రవర్తించాడు. పూరీ పిండిని అందరిలా రోల్ చేయకుండా.. ఇతను ఖాళీ గిన్నెతో పిండి ఉండపై నొక్కాడు. దీంతో అది చూస్తుండగానే వెడల్పుగా మారిపోయింది.
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
ఇలా పూరీ పిండిని గిన్నె సాయంతో రోల్ చేస్తున్న (man making puri with empty bowl) ఇతన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. పూరీలను విచిత్రంగా చేసే వారిని గతంలో చాలా మందిని చూశాం. ఓ మహిళ పూరీ ఉండలను ఒకదానిపై మరొకటిగా వరసుగా పేర్చి, వాటి మధ్యలో పాలిథిన్ కవర్ పెట్టి రుద్దడం చూశాం. అలాగే మరో మహిళ పొడవాటి గుండ్రటి కర్రతో ఒకేసారి మూడు, నాలుగు పూరీలను చేయడం కూడా చూశాం. ఇంకో మహిళ అయితే తన భర్త బట్టతలపై పూరీలను రుద్దుతూ అందరినీ తెగ నవ్వించింది.
Funny Viral Video: ఇది బీహార్ కటింగ్ స్టైల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పూరీలను ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఖాళీ గిన్నెతో పూరీలు.. ఐడియా అదిరింది బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 97 వేలకు పైగా లైక్‌లు, 20.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే.. చెప్పుల దొంగలకు భలే షాక్ ఇచ్చాడుగా..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..