Monkey Viral Video: హల్దీ ఫంక్షన్‌లో యువతిని టార్గెట్ చేసిన కోతి.. సడన్‌గా లోపలికి వచ్చి.. ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:53 PM
హల్దీ పంక్షన్‌లో వధూవరులు సోఫాలలో కూర్చుని ఉండగా.. చాలా మంది యువతులు చుట్టూ చేరి, వేడుక నిర్వహిస్తుంటారు. వారిలో ఓ యువతి చేతిలో ఆహార పదార్థాలు పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆమెను టార్గెట్ చేసిన కోతి.. చివరకు ఏం చేసిందో చూడండి..

కోతుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. అప్పటిదాకా కామ్‌గా ఉండే కోతులు.. ఒక్కసారిగా హల్‌చల్ చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఇళ్లలోని వస్తువులను ఎత్తుకెళ్లి మరీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా మనుషుల చేతిలోని ఆహార పదార్థాలను సైతం దౌర్జన్యంగా లాక్కెళ్లిపోతుంటాయి. ఇలాంటి షాకింగ్ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి హల్దీ ఫంక్షన్‌కి వచ్చిన యువతిని టార్గెట్ చేసింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వివాహ (Marriage) కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన హల్దీ పంక్షన్‌కు అతిథులంతా హాజరయ్యారు. వధూవరులు సోఫాలలో కూర్చుని ఉండగా.. చాలా మంది యువతులు చుట్టూ చేరి, వేడుక నిర్వహిస్తుంటారు. వారిలో ఓ యువతి ప్లేటులో ఆహార పదార్థాలు పట్టుకుని నిలబడి ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
దూరంగా ఉన్న ఓ కోతి ఆ యువతిని టార్గెట్ చేసింది. ఆమె చేతిలోని ఆహార పదార్థాలను ఎలాగైనా కొట్టేయాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా నేరుగా వేదిక వద్దకు వెళ్లింది. అంతా చూస్తుండగానే వారి మధ్యలోకి వెళ్లి, యువతి చేతిలోని ఆహార పదార్థాలను (monkey snatched food from young woman's hand) లాక్కుని అక్కడి నుంచి పారిపోయింది. కోతి చేసిన ఈ పనికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. కోతి నిర్వాకం చూసి కొందరు తెగ నవ్వుకున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి దోపిడీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతికి స్వీట్లంటే చాలా ఇష్టమున్నట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..