Cat And Pigeon Video: నిద్రపోతున్న పిల్లి.. సమీపానికి వచ్చిన పావురం.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Feb 28 , 2025 | 07:16 AM
ఓ పావురం నిద్రపోతున్న పిల్లిని దూరం నుంచి గమనించి చివరకు సమీపానికి వెళ్లింది. సమీపానికి వెళ్లడమే కాదు.. దాని మీదకు ఎక్కి అటూ, ఇటూ తిరుగుతూ దాన్ని డిస్టర్బ్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కోడిని చూస్తే పిల్లి.. పిల్లిని చూస్తే కుక్క, ఎలుకను చూస్తే పాము.. పామును చూసే ముంగిస దాడి చేయడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. శత్రువులు కాస్తా ఆశ్చర్యకరంగా మిత్రులుగా మారిపోతుంటాయి. మరికొన్నిసార్లు కలిసిపోవడమే కాకుండా కామెడీ కూడా చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, పిల్లి మరియు పావురం వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పావురం నిద్రపోతున్న పిల్లి వద్దకు వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పిల్లి, పావురం (Cat, Pigeon) మధ్య జరిగిన సరదా సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా పిల్లి, పావురం మధ్య శత్రుత్వం ఉంటుంది. పావురాన్ని చూడగానే పిల్లి దాడి చేసి చంపేస్తుంది. అయితే ఒక్కడ మాత్రం విరుద్ధంగా జరిగింది. ఓ పావురం నిద్రపోతున్న పిల్లిని దూరం నుంచి గమనించి చివరకు సమీపానికి వెళ్లింది.
సమీపానికి వెళ్లడమే కాదు.. దాని మీదకు ఎక్కి అటూ, ఇటూ తిరుగుతూ దాన్ని డిస్టర్బ్ చేసింది. పావురం పైకి ఎక్కడంతో పిల్లి షాక్ అయింది. ఒక్కసారిగా నిద్రలేచిన పిల్లికి.. (Pigeon woke the cat) పావురాన్ని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఎంత స్నేహం చేస్తే మాత్రం... నిద్రపోతున్న నన్ను కెలుకుతావా.. చూస్తుండు నిన్ను ఏం చేస్తానో’’.. అన్నట్లగా పావురంపై తన ముందు కాళ్లతో సుతిమెత్తగా దాడి చేస్తుంది. పిల్లి కోపాన్ని పావురం తమాషాగా తీసుకుని.. కాస్త పక్కకు వెళ్లి గుండ్రంగా తిరుగుతూ ఎక్కిరిస్తుందన్నమాట.
ఇలా పిల్లి మరియు పావరం మధ్య సరదా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పావురం కామెడీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇప్పటివరకూ మేం చూసిన వాటిలో ధైర్యం గల పావరం ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లు, 22 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..