Food Viral Video: పెళ్లి విందును లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నారా.. ఇతను చేసిన పని చూస్తే ఆలోచనలో పడతారు..
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:44 AM
సాధారణంగా పెళ్లి అనగానే ముందుగా విందు భోజనాలే గుర్తుకొస్తాయి. వివిధ రకాల ఆహారపదార్థాలను వరుసగా వడ్డిస్తుంటే.. అతిథులు లొట్టలేసుకుని మరీ ఆరగిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. పెళ్లి భోజనాలు చేసే ముందు ఆలోచించాల్సి వస్తుంది..

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. వీటిలో భోజనాలకు సంబంధించిన వీడియోలు అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. భోజనాలు చేసే సమయంలో జనాల రద్దీ, దోసెల కోసం తోసుకోవడం తదితర ఘటనలు జరగడం తెలిసిందే. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో వంట చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి అనగానే ముందుగా విందు భోజనాలే గుర్తుకొస్తాయి. వివిధ రకాల ఆహారపదార్థాలను వరుసగా వడ్డిస్తుంటే.. అతిథులు లొట్టలేసుకుని మరీ ఆరగిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. పెళ్లి భోజనాలు చేసే ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లో జరిగిన ఓ వివాహంలో (Marriage) వంట వారు రోటీలు చేస్తున్నారు.
Instagram Viral: ఇన్‌స్టాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా..
అయితే వారిలో ఓ యువకుడు రోటీలు చేసే సమయంలో దానిపై ఉమ్మి వేస్తూ కనిపించాడు. రోటీని కాల్చే సమయంలో (Man spits on rotis) దానిపై ఉమ్మి వేస్తున్నాడు. ఇలా చాలా రోటీలను అతను ఉమ్మి వేసి కాల్చుతున్నాడు. ముందుగా ఎవరికీ అతడిపై అనుమానం రాలేదు. అయితే కొందరు తీక్షణంగా గమనించగా.. ఆ వ్యక్తి నిర్వాకం బయటపడింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Poori Making Video: పూరీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఇతనెలా సింపుల్‌గా చేసేస్తున్నాడో చూడండి..
ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారి వల్ల.. బయట భోజనం చేయాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే.. చెప్పుల దొంగలకు భలే షాక్ ఇచ్చాడుగా..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..