Viral Video: బ్యాచిలర్స్ కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించాడుగా.. వంట చేస్తుండగా.. మధ్యలో ఒక్కసారిగా..
ABN , Publish Date - Feb 27 , 2025 | 02:03 PM
అద్దె ఇంట్లో ఉంటున్న కొందరు కుర్రాళ్లు.. వంట చేసేందుకు సిద్ధమయ్యారు. వీడియోలు చూస్తూ వంట చేసేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు యువకులు గ్యాస్ పొయ్యి ఎదురుగా కూర్చుని వంట చేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు ఏమైందో మీరే చూడండి..

బ్యాచిలర్స్ లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎలాగోలా నెట్టుకొస్తుంటారు. ప్రధానంగా బాడుగ ఇళ్లలో ఉండే బ్యాచిలర్స్ బాధలు కొన్నిసార్లు వర్ణణాతీతంగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు యువకులు వంట చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బ్యాచిలర్స్ కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అద్దె ఇంట్లో ఉంటున్న కొందరు కుర్రాళ్లు.. వంట (cooking) చేసేందుకు సిద్ధమయ్యారు. వీడియోలు చూస్తూ వంట చేసేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు యువకులు గ్యాస్ పొయ్యి ఎదురుగా కూర్చుని వంట చేసేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఓ వ్యక్తి ఫోన్‌లో వంట వీడియో చూస్తూ వారికి సలహాలు ఇస్తుండగా.. ఓ వ్యక్తి కూరగాయలు కట్ చేస్తుంటాడు. మరో యువకుడు వంట చేస్తుంటాడు.
ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్యలో ఫోన్ చూస్తున్న వ్యక్తి చెప్పినట్లుగా పక్కన ఉన్న వ్యక్తి వంట చేస్తుంటాడు. ఈ క్రమంలో పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేడి చేస్తాడు. అయితే తర్వాత మధ్యలో ఉన్న వ్యక్తి సూచన మేరకు.. వంట చేస్తున్న యువకుడు పెనంలో తరగిన కూరగాయలను ఒకేసారి పడేస్తాడు. దీంతో పెనంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంట పుడుతుంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.
Leopard Viral Video: వామ్మో.. షేక్‌ల విందులోకి చొరబడిన చిరుతపులి.. బిర్యానీ వాసన చూసి మరీ.. చివరకు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్యాచిలర్స్ కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘అవగాహన లేకుండా వంట చేస్తే ఇలాగే అవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..