Viral Video: ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే.. చెప్పుల దొంగలకు భలే షాక్ ఇచ్చాడుగా..
ABN , Publish Date - Feb 27 , 2025 | 08:59 AM
రద్దీగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తి.. తన చెప్పులు చోరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా తట్టింది. చివరకు ఆ వ్యక్తి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

దొంగల నుంచి తమ వస్తువులను కాపాడుకోవడానికి కొందరు అనేక రకాల భద్రతా చర్యలు తీసుకుంటుంటారు. కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొందరు సెక్యూరిటీని పెట్టుకుంటుంటారు. అలాగే ఇంకొందరు కాస్త వినూత్నంగా ఆలోచిస్తూ దొంగలు కూడా అవాక్కయ్యేలా చేస్తుంటారు. కార్లు చోరీ కాకుండా పైన ముళ్ల కంచె వేయడం, బైకు చక్రాలకు గొలుసు కట్టడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోన చూసిన నెటిజన్లు.. ‘‘ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తి.. తన చెప్పులు చోరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా తట్టింది. చెప్పులు వదిలిన తర్వాత (man locked the sandals) ఆ రెండింటికీ ఎంచక్కా తాళం వేశాడు.
Viral Video: ఎంతకు దిగజారిపోయార్రా.. వీళ్లు చోరీ చేస్తున్నదేంటో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఒకవేళ దొంగ ఎవడైనా ఆ చెప్పులను ఎత్తుకెళ్లాలని అనుకున్నా తాళం వేసి ఉండడం వల్ల వాటికి జోలికి వెళ్లే అవకాశం ఉండదు. ఇలా దొంగలకు షాక్ ఇస్తూ విచిత్ర ప్రయోగం చేశాడు. గతంలో ఓ వ్యక్తి తన చెప్పులు చోరీ కాకుండా ఇలాగే విచిత్ర ప్రయోగం చేయడం చూశాం. ఇందుకోసం అతను ఒక చెప్పును ఒక చోట, ఇంకో చెప్పును మరో చోట వదిలాడు. ఇలా దొంగను కన్‌ఫ్యూజ్ చేసి తన చెప్పులు చోరీ కాకుండా జాగ్రత్త తీసుకున్నాడు.
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
చెప్పులకు తాళం వేసిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చెప్పులు ఎత్తుకెళ్తే తాళం కూడా ఫ్రీగా వస్తుంది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: ఇది బీహార్ కటింగ్ స్టైల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..