Buffalo Viral Video: దున్నపోతును కంట్రోల్ చేయాలనుకున్నాడు.. దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు.. చివరకు..
ABN , Publish Date - Feb 28 , 2025 | 11:31 AM
ఓ పెద్ద దున్నపోతు ఇళ్ల మధ్యలో అటూ, ఇటూ పరుగెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దాన్ని నియంత్రించేందుకు ఎవరూ సాహసం చేయలేక.. దూరంగా నిలబడి చూస్తు్న్నారు. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో టవల్ పట్టుకుని దాని వద్దకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొందరు పాములు మొదలుకొని జంతువుల వరకూ ప్రతి ఒక్కదాన్నీ ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ శునకానందం పొందుతుంటారు. మరికొందరు అందరిలో హీరోలా బిల్డప్ ఇస్తూ జంతువులతో ఆటలు ఆడుతుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దున్నపోతును కంట్రోల్ చేయాలని ప్రయత్నించి, చివరకు ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘జంతువులతో ఆటలాడితే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద దున్నపోతు ఇళ్ల మధ్యలో అటూ, ఇటూ పరుగెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దాన్ని నియంత్రించేందుకు ఎవరూ సాహసం చేయలేక.. దూరంగా నిలబడి చూస్తు్న్నారు. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో టవల్ పట్టుకుని దాని వద్దకు వెళ్లాడు. దాని ఎదురుగా నిలబడి టవల్‌ను అటూ, ఇటూ తిప్పుతూ షో చేశాడు.
అప్పటికే కోపంతో ఉన్న దున్నపోతు.. అతడి వింత చేష్టలకు మరింత రెచ్చిపోయింది. ముందూ వెనుకూ (Buffalo tried to attack the man) చూడకుండా అతడి పైకి దూకింది. దున్నపోతు మీదకు రావడాన్ని గమనించిన ఆ వ్యక్తి షాక్ అయి పరుగందుకున్నాడు. అయినా దున్నపోతు అతన్ని వదలకుండా వెంబడించింది. తీరా కొమ్ములతో పొడిచే సమయంలో ఎంతో చాకచక్యంగా దాని దాడి నుంచి అతను తప్పించుకున్నాడు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దున్నపోతుతో ఆటలాడితే ఇలాగే అవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘అనవసరంగా కెలుక్కోవడమంటే ఇదే’’.. అంటూ ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..