Funny Viral Video: చోరీ చేయడంలోనూ భార్యకు ట్రైనింగ్.. చివరకు ఇద్దరూ కలిసి..
ABN , Publish Date - Mar 27 , 2025 | 07:23 AM
ఓ వ్యక్తి తన భార్యకు చోరీ చేయడంలో ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని, దాన్ని దూరం నుంచి చేత్తో విసిరికొడితే ఆమె పట్టుకునేలా శిక్షణ ఇచ్చాడు. చివరకు ఇద్దరూ కలిసి ఏం చేశారో చూడండి..

సోషల్ మీడియాలో వినోదానికి కొదవే ఉండదు. సినిమాలోని కామెడీ సీన్లకు మించిన వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ ఇలాంటి తమాషా వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చోరీ చేయడంలో తన భార్యకు ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఏం చేశారో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యకు చోరీ చేయడంలో ట్రైనింగ్ (trained in theft) ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని, దాన్ని దూరం నుంచి చేత్తో విసిరికొడితే ఆమె పట్టుకునేలా శిక్షణ ఇచ్చాడు. బాటిల్‌ను ఇలా తోయగానే.. ఆమె టక్కన పట్టేసుకుంది.
ఇలా చాలా సేపు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత.. ఇద్దరూ కలిసి చోరీ చేసేందుకు వెళ్లారు. ముందుగా ఓ దుకాణానికి వెళ్లి లోపల ఉన్న వ్యక్తిని తనకు కావాల్సిన వస్తువు గురించి అడిగాడు. అతను అలా లోపలికి వెళ్లగానే.. అక్కడున్న ఆహార పదార్థాల డబ్బాను చేత్తో వేగంగా విసిరాడు. వెనుకే నిలబడి ఉన్న అతడి భార్య.. దాన్ని పట్టేసుకుని, అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. తర్వాత అతను కూడా అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయాడు.
Viral Video: మరణం పలకరించడమంటే ఇదేనేమో.. ఈ బైకర్ల పరిస్థితి చూస్తే..
ఇలా భార్యకు చోరీ చేయడంలో శిక్షణ ఇచ్చి, అందరినీ తెగ నవ్విస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చోరీ శిక్షణలో ఆరితేరిందిగా’’.. అంటూ కొందరు, ‘‘పర్‌ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Rhino vs Animals: జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. దేనికి భయపడిందో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..