Viral Video: ఇతడి ప్రాంక్‌కు అంతా పరార్.. ఏం చేస్తున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 24 , 2025 | 08:37 AM
చాలా మంది ప్రాంక్‌ల పేరుతో బహిరంగ ప్రదేశాల్లో హంగామా చేయడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేసిన ప్రాంక్ చూసి అంతా భయంతో పారిపోతున్నారు..

ప్రస్తుత సోషల్ మీడియాలో చాలా మంది అనేక రకాల వీడియోలు చేస్తూ డబ్బులతో పాటూ ఫేమస్ కూడా అవుతున్నారు. అయితే కొందరు మాత్రం ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతున్నారు. మరికొందరు ప్రాంక్‌ల పేరుతో బహిరంగ ప్రదేశాల్లో హంగామా చేయడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేసిన ప్రాంక్ చూసి అంతా భయంతో పారిపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇదెక్కడి ప్రాంక్‌రా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై విచిత్రమైన ప్రాంక్ (Prank) చేసి, అందరినీ భయంభ్రాంతులకు గురి చేశాడు. ఓ బాలుడిని తనతో పాటూ తీసుకెళ్లిన అతను.. మనుషుల ముందు కూర్చోబెట్టి దుప్పటి కప్పుతాడు. ఆ తర్వాత అతడి తలను మెలితిప్పేస్తాడు. అది చూడగానే అక్కడ ఉన్న వారు భయంతో పారిపోతున్నారు.
అయితే దుప్పటి మూయక ముందు అక్కడ కూర్చున్న బాలుడు చేతిలో ఓ ఫుట్‌బాల్ పట్టుకుని ఉంటాడు. దుప్పటి కప్పే సమయంలో ఆ బంతిని తన తలపై పెట్టుకుంటాడు. దుప్పటి కప్పిన తర్వాత ఆ వ్యక్తి బాలుడి తలపై ఉన్న బంతిని గుండ్రండా తిప్పుతున్నాడు. ఇది చూసే వారికి మాత్రం.. బాలుడి తలను గుండ్రంగా తిప్పుతున్నట్లు కనిపిస్తుంది. ఇలా విచిత్రమైన ప్రాంక్ చేసి అందరినీ భయపెడుతున్నాడు.
Monkey Funny Video: క్యారెట్ అనుకుని మిరపకాయ తినేసిన కోతి.. చివరకు దాని రియాక్షన్ చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి ప్రాంక్‌రా నాయనా.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డుపై ఇలాంటి ప్రాంక్‌లు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లు, 52.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Python Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..