Share News

Tiger And Lion Video: సింహంతో పులి భీకర ఫైట్.. చివరకు జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 24 , 2025 | 10:26 AM

వేట కోసం తచ్చాడుతున్న సింహానికి దూరంగా పెద్ద పులి కనిపిస్తుంది. రెండూ ఎదురెదురు పడగానే ఒక్కసారిగా వాటి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆ రెండూ కలిసి తమ ముందు కాళ్లను పైకి లేపి మరీ ఒకదానికిపై మరొకటి పంజాలతో దాడి చేసుకుంటాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Tiger And Lion Video: సింహంతో పులి భీకర ఫైట్.. చివరకు జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

అడవికి రాజైన సింహానికి ఎదురు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. సింహం ముందు ఎలాంటి జంతువులైనా వెనుకడుగు వేయాల్సిందే తప్ప ఎదురుతిరిగి పోరాడే పరిస్థితి దాదాపు ఉండదు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇంతటి సింహాలకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువులతోనూ దారుణంగా ఓడిపోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహం, పులి మధ్య భీకర ఫైట్ జరిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేట కోసం తచ్చాడుతున్న సింహానికి దూరంగా పెద్ద పులి కనిపిస్తుంది. రెండూ ఎదురెదురు పడగానే (fight between lion and tiger) ఒక్కసారిగా వాటి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆ రెండూ కలిసి తమ ముందు కాళ్లను పైకి లేపి మరీ ఒకదానికిపై మరొకటి పంజాలతో దాడి చేసుకుంటాయి.

Viral Video: ఇతడి ప్రాంక్‌కు అంతా పరార్.. ఏం చేస్తున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..


చివరికి పులి సింహాన్ని కిందపడేసి పంజాతో తొక్కిపట్టేస్తుంది. ఇంతలో రెండు ఆడ సింహాలు అక్కడికి వస్తాయి. వాటిలో ఒక సింహం పులి దాడికి గురైన సింహాన్ని మరింత గాయపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత కూడా సింహం, పులి గొడవపడుతూనే ఉంటాయి. ఇలా చాలా సేపు వాటి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.

Python Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికి చుక్కలు చూపించిన పులి’’.. అంటూ కొందరు, ‘‘అడవికి నిజమైన రాజు పులే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.68 లక్షలకు పైగా లైక్‌లు, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Love Propose Video: పట్టుబట్టి సాధించాడుగా.. లవ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన అమ్మాయిని.. ఎలా ఒప్పించాడంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2025 | 10:28 AM