Share News

Viral Video: కుర్చీపై సవారీ.. ఇతడి వినూత్న ప్రయోగం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:40 PM

వినూత్న వాహనాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు సైకిల్ టైర్లు, పాత వాహనాల విడి భాగాలతో గుర్రపు బండ్లను తయారు చేస్తే.. మరికొందరు సగం గుర్రం బండ్లు, ఇంకో సంగం కారు తరహాలో తయారు చేస్తుంటారు. ఇలా చాలా మంది చిత్రవిచిత్ర వాహనాలు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: కుర్చీపై సవారీ.. ఇతడి వినూత్న ప్రయోగం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Kids Scooter and chair Vehicle Video

వినూత్న వాహనాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు సైకిల్ టైర్లు, పాత వాహనాల విడి భాగాలతో గుర్రపు బండ్లను తయారు చేస్తే.. మరికొందరు సగం గుర్రం బండ్లు, ఇంకో సంగం కారు తరహాలో తయారు చేస్తుంటారు. ఇలా చాలా మంది చిత్రవిచిత్ర వాహనాలు తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కుర్చీపై కూర్చుని రయ్యిన దూసుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ ఇతడి వినూత్న ప్రయోగం ఏంటో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అంతా కూర్చీని కూర్చోవడానికి మాత్రమే ఉపయోగిస్తే.. ఓ వ్యక్తి మాత్రం దాన్ని కూర్చోవడానికే కాకుండా రయ్యిన దూసుకెళ్లేలా తయారు చేశాడు. ఇందుకోసం అతను చిన్న పిల్లల స్కూటర్‌ను (Kids Scooter) ఉపయోగించాడు. స్కూటర్‌ మధ్యలో కుర్చీని పెట్టి సెట్ చేశాడు. తర్వాత కుర్చీలో కూర్చుని స్కూటర్ హ్యాండిల్ పట్టుకుని స్టార్ట్ చేశాడు.

Optical Illusion Test: మీ చూపుకో ఛాలెంజ్.. ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న మూడు తేడాలను కనుక్కోండి చూద్దాం..


ఇలా కుర్చీలో (chair) కూర్చుని దర్జాగా రోడ్డుపై దూసుకెళ్లాడు. దూరం నుంచి చూస్తే కుర్చీకి ప్రాణం వచ్చి కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా కుర్చీని విచిత్రంగా వినియోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: సాక్స్‌లు లేవని ఇలా ఎవరైనా చేస్తారా.. ఈమె అతి తెలివికి దండం పెట్టాల్సిందే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘కుర్చీని ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌‌లు, 36 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లల కుర్చీ వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం.. పక్కకు తీసి చూడగా గుండె ఆగిపోయే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2025 | 05:40 PM