Share News

Viral Video: ఎడ్ల బండా మజాకా.. ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:40 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వాహనాలకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. వాహనాల మధ్య పోటీకి సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అలాగే ఖరీదైన కార్లు కూడా కొన్నిసార్లు మొరాయించడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: ఎడ్ల బండా మజాకా.. ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ.. చివరకు జరిగింది చూస్తే..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వాహనాలకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. వాహనాల మధ్య పోటీకి సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అలాగే ఖరీదైన కార్లు కూడా కొన్నిసార్లు మొరాయించడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీచ్‌లో రైడ్ చేస్తుండగా.. ఖరీదైన ఫెరారీ కారు ఇసుకలో కూరుకుపోయింది. చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎడ్ల బండా మజాకా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) రాయ్‌గడ్‌‌‌ పరిధి రేవ్‌దండా బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబైకి చెందిన టూరిస్టులు ఖరీదైన ఫెరారీ కారులో బీచ్‌కు వచ్చారు. ఇసుకలో రైడ్ చేస్తుండగా కారు ఒక్కసారిగా ఇసుకలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ముందుకు కదల్లేదు. దీంతో చుట్టూ ఉన్న పర్యాటకులు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

Viral Video: కూలీగా మారిన కోతి.. మహిళతో కలిసి ఏం చేస్తుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


అయినా కారు మాత్రం ఇసుకలో నుంచి బయటికి రాలేదు. చివరకు వారంతా కలిసి ఎద్దుల బండిని ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడే ఉన్న ఓ ఎద్దుల బండి యజమాని అక్కడికి వచ్చాడు. కారుకు తాడు కట్టి ఎద్దుల బండితో లాగేందుకు ప్రయత్నించారు. తాడు కట్టగానే ఎద్దులను అదిలించడగా.. ఇసుకలో కూరుకుపోయిన కారును (bullock cart pulls Ferrari car) ఎంతో చాకచక్యంగా బయటికి లాగేశాయి. చూస్తుండగానే కారును అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాయి.

Viral Video: ఇది పీతా.. లేక ప్రేతాత్మా.. ఉడికించాలని చూడగా ఏం చేసిందో చూడండి..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎడ్ల బండా మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఎడ్ల బండి ముందు ఫెరారీ కూడా దిగదుడుపే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 250కి పైగా లైక్‌లు, 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గడ్డ కట్టిన నీటిలో ఇరుక్కున్న మొసలిని చూసి పాపం అనుకున్నారు.. చివరకు సమీపానికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2025 | 03:40 PM