Viral Video: ఇది పీతా.. లేక ప్రేతాత్మా.. ఉడికించాలని చూడగా ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jan 01 , 2025 | 08:34 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. ఆ వెంటనే వీడియో రూపంలో వైరల్ అవడం సర్వసాధారణమైంది. ఇలాంటి వీడియోల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలను చూసినప్పుడు.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. ఆ వెంటనే వీడియో రూపంలో వైరల్ అవడం సర్వసాధారణమైంది. ఇలాంటి వీడియోల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్ని వీడియోలను చూసినప్పుడు.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పీతను ఉడికిచాలని చూడగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇది పీతా.. లేక ప్రేతాత్మా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద పీతను పట్టుకుని వంట గదిలోకి తీసుకెళ్తాడు. దాన్ని ఉడికించి బాగా ఫ్రై చేయాలని అనుకుంటాడు. పీతను తీసుకెళ్లి పాత్రలో వేసి ఉడిచించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. పీతను ఇలా పాత్రలో వేయగా.. అలా పైకి వచ్చి కిందకు (crab jumped out of the bowl) దూకే ప్రయత్నం చేస్తుంది.
పాత్రలో వేసి మూత వేయాలని ఎంత ప్రయత్నించినా అది మాత్రం బలవంతంగా బయటికి వచ్చేస్తుంది. అయితే బయటికి దూకిన పీత.. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో చివరకు విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అక్కడే ఉన్న కత్తిని గోర్లతో పట్టుకుని అతడిని హెచ్చరిస్తుంది. పీతను పట్టుకోవాలని దగ్గరికి వెళ్లాలని చూడగా.. కత్తి చూపించి.. ‘‘దగ్గరికి వచ్చావో.. పొడిచి పొడిచి చంపుతా జాగ్రత్తా’’.. అన్నట్లుగా ఆ పీత అతన్ని హెచ్చరిస్తుంది. అలా కత్తి చూపిస్తూనే మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుందన్నమాట.
ఇలా విచిత్రంగా ప్రవర్తించిన పీతను చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఇది గ్రాఫిక్స్ అంటూ కొట్టిపడేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ నవ్విస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పీతలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయ్.. ఆత్మరక్షణలో భాగంగా ఇలా చేసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పీత మరీ విచిత్రంగా ఉందే’’.. అంట మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 73 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..