Viral Video: పిల్లల కుర్చీ వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం.. పక్కకు తీసి చూడగా గుండె ఆగిపోయే సీన్..
ABN , Publish Date - Jan 03 , 2025 | 04:07 PM
ప్రమాదాలు అనేవి చెప్పి రావు. మన చుట్టూనే ఉంటూ ఎప్పుడు ఎవరిని చుట్టుముడతాయో.. ఇంకెవరిని మృత్యుఒడిలోకి పంపిస్తాయో చెప్పలేము. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తృటిలో తప్పిపోతుంటాయి. మరికొన్నిసార్లు కొందరు అప్రమత్తంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి..
ప్రమాదాలు అనేవి చెప్పి రావు. మన చుట్టూనే ఉంటూ ఎప్పుడు ఎవరిని చుట్టుముడతాయో.. ఇంకెవరిని మృత్యుఒడిలోకి పంపిస్తాయో చెప్పలేము. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తృటిలో తప్పిపోతుంటాయి. మరికొన్నిసార్లు కొందరు అప్రమత్తంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్లల కుర్చీయే కదా అని దగ్గరికి వెళ్లి పట్టుకున్నారు. అయితే కుర్చీని పక్కకు తీసి చూడగా.. గుండె ఆగిపోయే సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని (Australia) మెల్‌బోర్న్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో సంబరాలు చేసుకుంటోంది. అయితే ఈ సందర్భంగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ ఇంటి హాలు మధ్యలో పిల్లల కుర్చీ ఉండడంతో దాన్ని పక్కకు తీసే పక్కకు తీసే ప్రయత్నం చేశారు.
Viral Video: సాక్స్‌లు లేవని ఇలా ఎవరైనా చేస్తారా.. ఈమె అతి తెలివికి దండం పెట్టాల్సిందే..
అయితే కుర్చీని ఇలా తీయగానే.. గుండె ఆగిపోయే సీన్ కనిపించింది. దాని కింద ప్రమాదకర టైగర్ స్నేక్ పడుకుని (tiger snake lying under child's chair) ఉండడాన్ని చూసి వారంతా షాక్ అయ్యారు. పొరపాటున పిల్లలు వెళ్లి కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నించి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఎట్టకేలకు ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని, పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కోబ్రాకు ఎదురుపడ్డ ముంగీస.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తుండగానే..
ఇవి కూడా చదవండి..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..