Viral Video: సాక్స్‌లు లేవని ఇలా ఎవరైనా చేస్తారా.. ఈమె అతి తెలివికి దండం పెట్టాల్సిందే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 09:56 PM
కొందరు రోజూ చేసే పనులనే విచిత్రంగా చేస్తే.. మరికొందరు అదే పనులను ఎవరూ చేయని విధంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలా ఇంకొందరు అతి తెలివితో చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కొందరు రోజూ చేసే పనులనే విచిత్రంగా చేస్తే.. మరికొందరు అదే పనులను ఎవరూ చేయని విధంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలా ఇంకొందరు అతి తెలివితో చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన కొడుక్కు సాక్స్‌లు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈమె అతి తెలివికి దండం పెట్టాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) తన కొడుకును (son) స్కూల్‌కు పంపేందుకు రెడీ చేస్తుంటుంది. స్నానం చేయించి స్కూల్ యూనిఫాం వేసి రెడీ చేసేసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. షూలు వేసే సమయంలో అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. సాక్స్‌లు లేకపోవడంతో షూలు వేయడంలో సమస్య తలెత్తింది. ఎలాగైనా సాక్స్‌లు రెడీ చేయాలని చూసినా ఇంట్లో కనిపించలేదు.
సాక్స్‌లు లేకపోవడంతో చివరకు ఆమె తన బుర్రకు పదును పెట్టింది. సాక్స్‌లు (socks) లేకున్నా.. ఉన్నట్లు భ్రమ కలిగించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం వంట పాత్రను తీసుకుని, దాని కింద ఉన్న మసిని పిల్లాడి కాళ్లకు పూసేసింది. సాక్స్‌ల ఆకారంలో మసిని పూయడంతో ఎవరికీ అనుమానం రాదు. ఇలా రూపాయి ఖర్చు లేకుండా సాక్స్‌లను సిద్ధం చేసిన ఈ మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: కోబ్రాకు ఎదురుపడ్డ ముంగీస.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తుండగానే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాక్స్‌లను ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300 వందలకు పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..