Share News

Viral Video: కోబ్రాకు ఎదురుపడ్డ ముంగీస.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తుండగానే..

ABN , Publish Date - Jan 02 , 2025 | 07:02 PM

కోబ్రా, ముంగీసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ రెండు ఎదురుపడితే భీకర ఫైట్ మొదలవడం సర్వసాధారణం. అయితే ఈ పోటీలో కొన్నిసార్లు కోబ్రా గెలిస్తే.. మరికొన్నిసార్లు ముంగీస గెలుస్తుంటుంది. ఎక్కువ సార్లు మాత్రం ముంగీస పైచేయి సాధిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా..

Viral Video: కోబ్రాకు ఎదురుపడ్డ ముంగీస.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తుండగానే..
Snake and Mongoose Fight Video

కోబ్రా, ముంగీసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ రెండు ఎదురుపడితే భీకర ఫైట్ మొదలవడం సర్వసాధారణం. అయితే ఈ పోటీలో కొన్నిసార్లు కోబ్రా గెలిస్తే.. మరికొన్నిసార్లు ముంగీస గెలుస్తుంటుంది. ఎక్కువ సార్లు మాత్రం ముంగీస పైచేయి సాధిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలో ఆహారం కోసం వెతుకుతున్న కోబ్రాకు ముంగీస ఎదురుపడుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ కోబ్రా నీటిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే ఇంతలో దానికి ఓ ముంగీస ఎదురుపడుతుంది. పామును చూడగానే ముంగీస దాడికి సిద్ధమవుతుంది. పాము కూడా పడగ విప్పి దాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ముంగీస ఏమాత్రం (mongoose attacking a cobra) భయపడకుండా దానిపై దాడి చేస్తుంది.

Viral Video: మంచులో ఆటో స్టార్ట్ చేయాలని చూడగా డ్రైవర్‌కు షాక్.. చివరకు ఏమైందో మీరే చూడండి..


ముంగీస దాడి నుంచి తప్పించుకున్న పాము.. తిరిగి దాన్ని కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ముంగీస మాత్రం ఎంతో తెలివిగా దాని దాడి నుంచి తప్పించుకుని దెబ్బతీస్తుంది. ఇలా అనేక సార్లు ముంగీస దాడి చేయడంతో చివరకు పాము భయంతో దూరంగా పారిపోతుంది. అయినా ముంగీస మాత్రం పామును వదలకుండా పదే పదే దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే ఈ ఫైట్‌లో ముంగీస గెలిచినట్లు అనిపిస్తోంది.

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఫైట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పాముకు చుక్కలు చూపించిన ముంగీస’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 2.47 లక్షలకు పైగా వ్యూ్స్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎడ్ల బండా మజాకా.. ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2025 | 07:02 PM