Share News

Viral Video: గాలిపటం ఎగురవేస్తున్న కోతి.. మేడపై దాని నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 02:30 PM

కోతులు కొన్నిసార్లు అందరికీ చిరాకు తెప్పించే పనులు చేస్తే.. మరికొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. ఇంకొన్నిసార్లు అయితే కోతులు ఇలాక్కూడా చేస్తాయా.. అనేంతలా వింత వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి..

Viral Video: గాలిపటం ఎగురవేస్తున్న కోతి.. మేడపై దాని నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..
Monkey Flying Kite

కోతులు కొన్నిసార్లు అందరికీ చిరాకు తెప్పించే పనులు చేస్తే.. మరికొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. ఇంకొన్నిసార్లు అయితే కోతులు ఇలాక్కూడా చేస్తాయా.. అనేంతలా వింత వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి మేడపై కూర్చుని చేస్తున్న పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కోతులు ఇలాక్కూడా చేస్తాయా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి (Sankranti) పండుగ రానుంది. అయితే ఇప్పటి నుంచే పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. మనుషులను చూసి ఓ కోతి కూడా ఇన్‌స్పైర్ అయినట్లుంది. ‘‘గాలిపటాలు ఎగరవేయడం నాకూ వచ్చు.. మీ కంటే ఎత్తుకు ఎగురవేసి నా టాలెంట్ చూపిస్తా’’.. అన్నట్లుగా ఓ కోతి మేడ పైకి ఎక్కేసింది.

Viral Video: ప్రాణాలకు తెగించింది.. పక్షిలా మారింది... ఈ కోడి విన్యాసం చూశారంటే..


చూస్తుండగానే ఓ గాలి పటాన్ని చకచకా గాల్లోకి ఎగురవేసింది. అచ్చం మనుషుల్లాగానే దారాన్ని లాగుతూ (monkey flying a kite) గాలిపటాన్ని పైకి ఎగురేసింది. ఇలా చాలా సేపు గాలిపటాన్ని కంట్రోల్ చేస్తూ మనుషుల్లాగానే ఎంజాయ్ చేసింది. చివరగా.. ‘‘ఈ రోజుకు ఈ ఆట చాలు.. మళ్లీ రేపు వచ్చి ఎగరేస్తా’’.. అనుకుంటూ గాలిపటాన్ని మళ్లీ తన వద్దకు లాగేసుకుంది. ఈ విధంగా ఈ కోతి గాలిపటాన్ని మనుషుల్లాగానే ఎగురవేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నమాట.

Viral Video: బాప్‌రే.. ఇదేం ఎటాక్‌రా బాబోయ్.. ఈ జాగ్వార్ వేట చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఈ ఘటనను దూరంగా ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 9.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 06 , 2025 | 02:30 PM