Snake Viral Video: ఈ పాము మరీ కామెడీగా ఉందే.. బాత్‌రూంలోకి వెళ్లిన వ్యక్తిని ఎలా భయపెట్టిందో చూస్తే..
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:46 PM
ఓ వ్యక్తి స్నానం చేద్దామని బాత్‌రూంలోకి వెళ్లాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే అతడికి గండెలు అదిరిపోయే సీన్ కనిపించింది. ఓ నాగుపాము లోపలికి రావడం చూసి అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఇళ్లల్లోకి చొరబడే పాములు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. తలుపు తీద్దామని వెళ్తే సందులో నుంచి బయటికి వచ్చి బుసలు కొడుతుంటాయి. అలాగే పడుకుందామని మంచం వద్దకు వెళ్తే దాని కింద నుంచి హాయ్.. అంటూ పలకరించి గుండెలదిరేలా చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏకంగా పగబట్టాయేమో అనేట్లుగా ప్రవర్తిస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పాము విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పాము మరీ కామెడీగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video)వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్నానం చేద్దామని బాత్‌రూంలోకి వెళ్లాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే అతడికి గండెలు అదిరిపోయే సీన్ కనిపించింది. ఓ నాగుపాము లోపలికి (snake went into the bathroom) రావడం చూసి అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. భయం భయంగానే తన ఫోన్‌లో వీడియో తీయడం స్టార్ట్ చేశాడు.
Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టడం చూద్దాం.
అయితే అలికిడి విన్న ఆ పాము బయటికి వెళ్లేందుకు డోరు వద్దకు వెళ్తుంది. అయితే సగం బయటికి దాటుకుని మళ్లీ లోపలికి వస్తుంది. వచ్చీ రాగానే బుసలు కొడుతూ (snake scared man by hissing) వీడియో తీస్తున్న వ్యక్తి వైపు చూస్తుంది. ‘‘నన్నే వీడియో తీస్తావా.. చూస్తుండి నిన్ను ఏం చేస్తానో’’.. అన్నట్లుగా అతడి మీదకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే కాస్త ముందుకు రాగానే.. మనసు మార్చుకుని అక్కడే ఓ మూల ఉన్న డ్రమ్ము మధ్యలోకి దూరిపోతుంది. దీంతో చివరకు ఆ వ్యక్తి బతుకుజీవుడా అనుకుంటూ బాత్‌రూం డోరు తీసి పారిపోతాడు.
Dog Viral Video: కుక్కతో రైలెక్కాలని చూస్తే.. ఇలా జరిగిందేంటీ.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పామేంటీ ఇలా చేసిందీ.. మరీ కామెడీగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘స్నానం చేయకుండానే తడిసిపోయాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 3.54 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Lovers Viral Video: ఇది మరీ దారుణం.. నడిరోడ్డుపై ఈ ప్రేమ జంట నిర్వాకం చూసి అంతా షాక్..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..