Share News

Dog Viral Video: కుక్కతో రైలెక్కాలని చూస్తే.. ఇలా జరిగిందేంటీ.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:10 PM

ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని రైల్వే స్టేషన్‌కు వస్తాడు.అప్పటికే రైలు ప్లాట్‌ఫామ్ నుంచి కదులుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎలాగైన అందులో వెళ్లాలనే ఉద్దేశంతో రైలు కదులుతుండగానే ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

Dog Viral Video: కుక్కతో రైలెక్కాలని చూస్తే.. ఇలా జరిగిందేంటీ.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..

కదులుతున్న రైళ్లు ఎక్కే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు నిర్లక్ష్యంగా కదిలే రైళ్లు ఎక్కుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరు ఏకంగా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. తాజాగా, షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కుక్కతో సహా కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని రైల్వే స్టేషన్‌కు వస్తాడు.అప్పటికే రైలు ప్లాట్‌ఫామ్ నుంచి కదులుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎలాగైన అందులో వెళ్లాలనే ఉద్దేశంతో రైలు కదులుతుండగానే ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు.

Swimming Viral Video: ఈతకు వెళ్తుంటే ఇలా మాత్రం చేయొద్దు.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..


ముందుగా కుక్కను రైల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ క్రమంలో అదుపు తప్పి కుక్క రైలుకు, ప్లాట్‌ఫామ్‌‌కు (dog falling in the middle of the platform) మధ్యలో పడిపోతుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. కిందకు తొంగి చూస్తూ అటూ, ఇటూ పరుగెడుతూ కంగారుపడిపోతాడు. ఈ ఘటనను చూసి షాకైన ప్రయాణికులు పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.

Viral Video: మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో.. చితిపై పడుకోబెట్టగానే ఏం జరిగిందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్కతో ఇలాంటి విన్యాసాలు చేయడం దారుణం.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. తెలిసి తెలిసి కుక్కను చంపేశాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6400కి పైగా లైక్‌లు, 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Lovers Viral Video: ఇది మరీ దారుణం.. నడిరోడ్డుపై ఈ ప్రేమ జంట నిర్వాకం చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 12:10 PM