Share News

Swimming Viral Video: ఈతకు వెళ్తుంటే ఇలా మాత్రం చేయొద్దు.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Apr 02 , 2025 | 10:54 AM

చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Swimming Viral Video: ఈతకు వెళ్తుంటే ఇలా మాత్రం చేయొద్దు.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..

ప్రస్తుతం వేసవి ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది ఇలాంటి సమయాల్లో బావులు, చెరువులు, కాలువల్లో ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఈత కొట్టే సమయంలో చెట్టుపై నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది యువకులు చెరువులో ఈత కొడుతుంటారు. అంతా నీళ్లలో మునిగి ఈత కొడుతుండగా.. వారిలో ఓ వ్యక్తి చెట్టుపై నుంచి నీళ్లలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. చెట్టు పైకి ఎక్కిన అతను.. నీళ్లలోకి దూకకుండా కొమ్మపై నిలబడి ఎగురుతూ డాన్స్ చేస్తాడు.

Viral Video: మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో.. చితిపై పడుకోబెట్టగానే ఏం జరిగిందో చూడండి..


ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి ధబేల్‌మని కిందపడిపోతాడు. అయితే నీళ్లలో పడకుండా గట్టు మీద పడడంతో (man fell from tree branch onto the water's edge) బలైమన గాయాలవుతాయి. దీంతో చలనం లేకుండా నీళ్లలో పడిపోతాడు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతా కంగారుగా అక్కడికి వచ్చి అతన్ని నీళ్లలో నుంచి పైకి లేపే ప్రయత్నం చేస్తారు. అయినా ఆ వ్యక్తిలో ఎలాంటి కదలికా రాదు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది.

Locopilot Viral Video: ఈ రైలు డ్రైవర్‌కు దండం పెట్టాల్సిందే.. ఇంజిన్‌ను ఆపి మరీ ఏం చేస్తున్నాడో చూడండి..


ఈ ఘటన ఎక్కడ జరిగిందో, ఆ యువకుడి పరిస్థితి ఏమైందో తెలియరాలేదు. కాగా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘పడిపోగానే కొమ్మను వదిలేసి ఉండుంటే నీళ్లలో పడేవాడు.. ప్రమాదం తప్పి ఉండేది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 3వేలకు పైగా లైక్ చేశారు.

Jugad Viral Video: బెడ్‌పైనే షికారు.. ఇతడి టాలెంట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 10:54 AM