Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టండి చూద్దాం..
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:57 PM
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి నీటి ఒడ్డున కుర్చీలో కూర్చుని చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే తీరా గాలం నీటిలోకి వేయాలని చూడగా దాని చివరన ఉండాల్సిన హుక్ కనిపించలేదు. దాన్ని 20 సెకన్లలో కనిపెట్టి ఆ వ్యక్తి సాయం చేయండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాగే కొన్ని పజిల్స్ అంతే స్థాయిలో మన కళ్లకు పరీక్ష పెడుతుంటాయి. చాలా చిత్రాలు చూసేందుకు సాధారణంగా కనిపించినా అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలా ప్రయత్నాలు చేయడం వల్ల ఏకాగ్రత మరింత పెరగడంతో పాటూ మానసిక సమస్యల నంచి ఉపశమనం కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాాజగా, ఓ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే గాలానికి ఉండే హుక్ కనిపించలేదు. దాన్ని 20 సెకన్లలో వెతికి పెట్టి అతడికి సాయం చేయండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి నీటి ఒడ్డున కుర్చీలో కూర్చుని చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే తీరా గాలం నీటిలోకి వేయాలని చూడగా దాని చివరన ఉండాల్సిన హుక్ కనిపించలేదు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
అతడికి ఎదురుగా నీళ్లలో కొన్ని బాతులు కనిపిస్తాయి. ఆ వ్యక్తి కూర్చున్న కుర్చీ పక్కనే ఓ చిన్న బ్యాగు ఉంటుంది. ఆ పక్కనే పెద్ద చెట్లు చిన్న చిన్న రాళ్లు కనిపిస్తాయి. అంతకు మించి ఇందులో ఎక్కడా హుక్ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీ కంటికి కనిపించకుండా (Hidden hook) ఆ హుక్ ఇక్కడే దాక్కుని ఉంది.
అయితే అంత సులభంగా మాత్రం కనిపించదు. ఈ చిత్రంపై కాస్త దృష్టి నిలిపి గమనిస్తే.. ఆ హుక్‌ను సులభంగా గుర్తించవచ్చు. చాలా మంది దాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు గానీ.. కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ప్రయత్నించండి. 20 సెకన్లలో ఆ హుక్‌ను గుర్తించారంటే మాత్రం మీరు జీనియస్ అని అర్థం. ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆ హుక్‌ను గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..