Lion Viral Video: గాండ్రిస్తూ రోడ్డు పైకి వచ్చిన సింహం.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:52 PM
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న హైవేపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద సింహం గాండ్రిస్తూ రోడ్డు పైకి వచ్చింది. దీంతో వాహనదారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సింహాన్ని చూడగానే ..

అటవీ సమీప ప్రాంతాల్లో పులులు, సింహాలు జనావాసాల్లోకి చొరవడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మనుషులు, జంతువులపై దాడి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు రోడ్లపై అడ్డంగా పడుకుని వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు నడి రోడ్డుపై ఠీవీగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం గాండ్రిస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) అమ్రేలి జిల్లా భావ్‌నగర్-సోమనాథ్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న హైవేపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద సింహం గాండ్రిస్తూ (lion came on the road) రోడ్డు పైకి వచ్చింది. దీంతో వాహనదారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సింహాన్ని చూడగానే ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
గాండ్రిస్తూ రోడ్డు పైకి వచ్చిన సింహం.. ఠీవీగా నడుస్తూ రోడ్డుకు అవతలకు వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో రోడ్డుకు రెండు వైపులా మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సింహాన్ని చూసిన వారు పరుపరుగున సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. అంతరించిపోతున్న ఆ ఆసియా సింహాలు.. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో సంచరిస్తుంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఆసియా సింహాలను పెంచేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Viral: గేదెల కోసం పెళ్లి పీటలెక్కిన మహిళ.. చివరకు అత్తమామల ఎంట్రీతో వెలుగులోకి అసలు విషయం..
కాగా, రోడ్డుపై సంచరిస్తున్న ఆ ఆసియా సింహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం సింగిల్‌గా రావడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. సింహం ఎంట్రీ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..