Share News

Viral: గేదెల కోసం పెళ్లి పీటలెక్కిన మహిళ.. చివరకు అత్తమామల ఎంట్రీతో వెలుగులోకి అసలు విషయం..

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:04 PM

ఓ మహిళ గేదెలు కొనేందుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తీరా వివాహం జరుగుతున్న సమయంలో అత్తమామలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో చివరకు మహిళ గురించి షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..

Viral: గేదెల కోసం పెళ్లి పీటలెక్కిన మహిళ.. చివరకు అత్తమామల ఎంట్రీతో వెలుగులోకి అసలు విషయం..

వివాహ కార్యక్రమాల్లో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా.. ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వివాహాల గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి ఆశ్చర్యకర వివాహానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ గేదెల కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే చివరకు అత్తమామల ఎంట్రీతో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హసన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది జంటలకు సామూహిక వివాహాలను (Mass Marriages) నిర్వహించారు. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు రూ.35,000 బహుమతి అందించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Marriage Viral Video: వివాహ వేదికపై సంతోషంగా ఉన్న వరుడు.. సడన్‌గా దగ్గరికొచ్చిన ప్రియురాలు.. చివరకు..


మంటపంలోకి వచ్చిన ఓ వృద్ధ జంట.. వధూవరుల (bride and groom) వద్దకు వచ్చింది. వారిని చూడగానే వధువు ఒక్కసారిగా షాక్ అయింది. తమ కోడలు రెండో పెళ్లి (Second marriage) చేసుకుంటోందంటూ సదరు వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ జంటను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో.. ఆమె నూర్ మొహమ్మద్ అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే తర్వాత కుటుంబ సమస్యల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

Viral Video: నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద కదలిక.. ఏముందా అని బయటికి తీసి చూడగా.. షాకింగ్ సీన్..


ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో సదరు మహిళ రూ.35,000 పథకం గురించి తెలుసుకుని, తన బంధువు జాబర్ అహ్మద్‌ను వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ డబ్బులతో గేదెలతో (buffaloes) పాటూ రెండు జతల బట్టలు, గోడ గడియారం, వెండి ఉంగరాలు తదితరాలు తీసుకోవాలనేది వారి మధ్య ఒప్పందం. ఇలా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి వివాహం చేసుకున్న ఈ జంటపై పోలీసులు.. వారి వివాహాన్ని రద్దు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 12:04 PM