Home » Andhra Pradesh » Prakasam
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కలెక్టర్ నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ విచారణ రెండవ రోజైన గురువారం కూడా కొనసాగింది. కాగా విచారణ సమయంలో అక్కడ కొందరు వివాదాస్పద ఉద్యోగులు ఉండటంపై బ్యాంకు ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని 8వ సర్వే నంబరులో కొంతమంది అక్రమంగా మైనింగ్ చేస్తూ వైట్ క్వార్ట్జ్ వెలికితీస్తున్నారు. పెద్ద రాళ్లను పగులకొట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తర్లుపాడులో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ప్లాంట్ మూడు రోజుల క్రితం మూతపడింది.
జిల్లాలో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ అక్రమ వ్యాపారం నెలలో మొదటి పక్షం రోజులు మాత్రమే జరుగుతోంది.
అక్రమంగా తరలి స్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ కులశేఖర్ ఆదేశాను సారం సీఐ ఎన్.రాఘవరావు ఆధ్వర్యంలో బుధవారం అర్ధరా త్రి బొద్దికూరపాడు-రాజంపల్లి మార్గంలో వెళుతున్న లారీని తనిఖీ చేయగా 370 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.
కనిగిరి అభివృద్ధిలో అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన్ గఫార్ అధ్యతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడా రు. కనిగిరిలో జరిగిన, జరగనున్న ఆక్రమణల తొలగింపు లో తమ ప్రమేయం లేదన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆర్డినెన్స్ ఎన్నికలు రావటంతో నిలిచిందన్నారు.
ఆంధ్ర తెలుగు అసోసియేషన్ న్యూజిలాండ్ ఎన్ఆర్ఐ టీడీపీ వారి అహ్వానం మేరకు న్యూజిలాండ్ వెళ్లిన పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, నరేంద్ర వర్మ గురువారం అదేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయ్యారు.
మేదరమెట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో విద్యార్థులు, ప్రజల కు ఉపయోగపడే రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మన్నె రామారావు అన్నారు. గురువారం మేదరమెట్లలో రూ.40లక్షల విలువైన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
పర్చూరు ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. భవనం దెబ్బతిని పెచ్చులు ఊడి ప్రయాణికులపై పడుతున్నాయి. అ యినా పట్టించుకునేవారే లేరని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం బస్టాండ్లో నిరీక్షించే సమయం లో ఏం ప్రమాదం జరుగుతోందోనని వారు భయపడుతున్నారు. ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. తరచూ మరమ్మతులతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది.
ఒంగోలు నగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో నిర్వహణ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఐదేళ్లుగా పట్టణాల ప్రగతిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిఽధులను విడుదల చేయలేదు. దీంతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులే ఆధారమయ్యాయి.