Home » Andhra Pradesh » Prakasam
తెలుగుదేశం ప్రభుత్వ హయాం (2014-19)లో నీరు-చెట్టు పనులు చేసిన వారికి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొదిలి ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో రూ.4కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి.
టంగుటూరు మండలంలోని కొణిజేడుకు చెందిన చిన్నకత్తుల వల్లూరయ్య (38) మద్యం మత్తులో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒంగోలు నగర సుందరీకరణ కోసం ‘వార్డుకో వారం’ ప్రత్యేక పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాలను శ్రీకారం పలికినట్లు నగర కమిషనరు డాక్టర్ కే వెంకటేశ్వరరావు చెప్పారు.
‘మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. కేవలం మార్కాపురం సమగ్రాభివృద్ధే మా లక్ష్యం. అందుకను గుణంగానే ఆక్రమణల తొలగింపులు చేపట్టాం.
పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులోని బలిజ సేవాసంఘం నూతనంగా నిర్మించిన మిని కల్యాణ మండపాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
మండలంలో బర్లీ పొగాకు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మిరప సాగు తగ్గడం, రైతులు విస్తారంగా పొగాకు సాగుకు సన్నద్ధం కావడంతో పొగ నారుకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. గత ఏడాది బర్లీ పొగాకు సాగు చేసిన రైతాంగం మంచి లాభాలు గడించడంతో అధిక శాతం రైతులు పొగాకు సాగుకు మొగ్గుచూపుతున్నారు.
దర్శి ప్రాంత ప్రజల చిరకాలవాంఛను టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం ద్వారా నెరవేరుస్తున్నట్టు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. దర్శి పట్టణంలోని తూ ర్పుగంగవరం రోడ్డులో రూ.2కోట్లతో నిర్మించతల పెట్టిన కల్యాణ మండపానికి ఆదివారం ఎంపీ మా గుంట, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపా టి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు భూమిపూ జ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
సమస్యల పరిష్కారం కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.
జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేసే గ్రేడ్-5,6 (సచివాలయ) ఉద్యోగుల పోస్టింగ్‌ల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. 50 రోజులుగా పంచాయితీ నడుస్తూనే ఉంది.
జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. రబీలో కీలక పంటలైన పొగాకు, వరి, మిర్చి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఖరీ్‌ఫలో సాగు చేసిన కంది, పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న వంటివి కళకళలాడుతున్నాయి.