Telangana Rains: తెలంగాణకు గుడ్ న్యూస్.. అప్పటి వరకు వర్షాలు
ABN , Publish Date - May 07 , 2024 | 07:47 AM
ఉక్కపోతలతో సతమవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ(IMD) గుడ్ న్యూస్ చెప్పింది. వడగాల్పులకు బ్రేక్ చెబుతూ పలు జిల్లాల్లో వర్షాలు(Telangana Rains) కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
హైదరాబాద్: ఉక్కపోతలతో సతమవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ(IMD) గుడ్ న్యూస్ చెప్పింది. వడగాల్పులకు బ్రేక్ చెబుతూ పలు జిల్లాల్లో వర్షాలు(Telangana Rains) కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని తూర్పు విదర్బ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన కనిపిస్తోంది.
మే 7న జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మే 10వ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో మే 12 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని వివరించింది.
సోమవారం ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. సోమవారం అత్యధికంగా జగిత్యాలలో 46.8°C, పెద్దపల్లిలో 46.4°C, కరీంనగర్‌లో 46.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ చందానగర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రానున్న 48 గంటలలో, హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39°C, 27°Cగా రికార్డవుతాయని.. నగరంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Read Latest News and Telangana News Here