Share News

Vasantha Venkata Krishna Prasad: జగన్ నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

ABN , Publish Date - Sep 23 , 2024 | 08:11 PM

ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు

Vasantha Venkata Krishna Prasad: జగన్  నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి
Vasantha Venkata Krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా (మైలవరం): మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాగుకు, నదికి తేడా తెలియదని మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (Vasantha Venkata Krishna Prasad) విమర్శించారు. మిడి మిడి ఙ్ఞానంతో అవగాహన రాహిత్యంతో విమర్శలు చేశారని అన్నారు. బుడమేరు గురించి జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని విమర్శలు చేశారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇటీవల బుడమేరు ముంపునకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విమర్శించారు.


ALSO READ: Bhumana Karunakar Reddy Video: టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరు పరిస్థితిని అధికారులతో పర్యవేక్షించానని వివరించారు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోతే ఆ ప్రాంతంపై ప్రభావం చూపేదన్నారు. గేట్లు ఎత్తే సమయానికే 4.5 అడుగులమేర వరద నీటి ప్రవాహం వచ్చిందన్నారు. గేట్లు ఎత్తకపోతే నాలుగైదు గ్రామాల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండేవని చెప్పారు. నిజాలను వదిలేసి బ్లూ మీడియా సాక్షిలో ఇష్టారాజ్యంగా ప్రేలాపనలు పేలుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ALSO READ: Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

కేవలం సాక్షిలో వచ్చే కథనాలను నమ్ముతున్న జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. విజయవాడ నగరాన్ని, మైలవరం నియోజకవర్గాన్ని బుడమేరు వరద ముంచేసిందని.. ఈ పరిస్థితుల గురించి జగన్మోహన్ రెడ్డికి అర్ధం అయ్యేటట్లు చెబుదామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ చెప్పారు.


ALSO READ: Pawan Kalyan: టీటీడీ ఆస్తులను దోచేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు

తిరుపతి లడ్డూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదంపై ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూల తయారీకి కిలో రూ.320ల చొప్పున వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొన్నారంటే ఇది పశువుల కొవ్వుతో తయారు చేసింది కాక మరేమిటి అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విమర్శలు చేశారు.


ALSO READ: Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంలో నిజాలు బయటకు రావాలి: పొన్నవోలు సుధాకర్ రెడ్డి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతి, సీఎం చంద్రబాబు చేసిన కృషిని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రజలకు వివరించారు. దార్శనికత గల నాయకుడు, విజన్ ఉన్న నేత అని చెప్పారు. సంక్షోభంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు గొప్ప పరిపాలనా దక్షుడని వివరించారు. ఏపీలో పరిశ్రమల స్థాపనలతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు.


ALSO READ: Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..

ఇటీవల ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు విశిష్ట సేవలను అందించారని తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు. వరద బాధితులకు పునరావాసం కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా ‘‘ఇది మంచి ప్రభుత్వం’ రెండు కరపత్రాలు ఆవిష్కరించారు. ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నూతలపాటి బాలకోటేశ్వరరావు (బాల) , ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

AP News: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌పై సొంత బాబాయ్ ఫైర్

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 08:32 PM