Puzzle: ఈ క్లాస్‌రూంలో పడిపోయిన.. టీచర్ కళ్లద్దాలను కనిపెట్టండి చూద్దాం..
ABN , Publish Date - Jun 27 , 2024 | 08:50 PM
సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఈ తరహా పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం వల్ల...
సోషల్ మీడియాలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఈ తరహా పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుగుతుంది. అలాగే మెడదకు వ్యాయామం కూడా అందుతుంది. తాజాగా, ఇలాంటి ఒక ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న క్లాస్‌రూంలో టీచర్ కళ్లద్దాలు పడిపోయాయి. అవి ఎక్కడున్నాయో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ పజిల్ (Puzzle Viral Photo) ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ క్లాస్ రూంలో టీచర్ (Teacher) పాఠాలు చెబుతున్నాడు. అయితే కొందరు పిల్లలు పాఠాలు వింటుంటే ఓ విద్యార్థి పేపర్లు ఎగరేస్తూ ఆడుకుంటున్నారు. ఇంకో విద్యార్థి బెంచిపై పడుకుని నిద్రపోతున్నాడు. దీంతో ముందు కూర్చున్న బాలిక.. వెనుక నిద్రపోతున్న విద్యార్థిని లేపేందుకు ప్రయత్నిస్తోంది.
Woman: ‘‘నేను శివుడు, నువ్వు పార్వతి’’.. మహిళకు వింత కథ చెప్పిన మరో మహిళ.. చివరకు..
అయితే ఇదే క్లాస్ రూంలో టీచర్ కళ్లద్దాలు (Hidden glasses) పడిపోయాయి. దీంతో ఆ టీచర్‌కు బోర్డుపై అక్షరాలను రాయడం ఇబ్బందిగా మారింది. దీంతో తన కళ్లద్దాలను వెతికే పనిలో పడ్డాడు. అయితే ఆ కళ్లద్దాలు మాత్రం ఎంతకీ దొరకలేదు. చాలా మంది నెటిజన్లు ఆ కళ్లద్దాలను వెతికే పనిలో పడ్డారు. ఇంకెందకు ఆలస్యం మీరూ కూడా ఆ కళ్లద్దాలు ఎక్కడున్నాయో వెతికి టీచర్‌కు సాయం చేయండి. ఒకవేళ మీకు ఇప్పటికీ కళ్లద్దాలను వెతకడం కష్టంగా ఉంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.