Share News

Viral video: విమానంలో గర్భిణికి ఇబ్బంది.. పట్టించుకోని మహిళకు.. వెనుక నుంచి షాకింగ్ ఝలక్..

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:12 PM

బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది వేడుక చూస్తారే గానీ.. సాయం చేసేందుకు ముందుకు రారు. కొందరైతే..

Viral video:  విమానంలో గర్భిణికి ఇబ్బంది.. పట్టించుకోని మహిళకు.. వెనుక నుంచి షాకింగ్ ఝలక్..

బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది వేడుక చూస్తారే గానీ.. సాయం చేసేందుకు ముందుకు రారు. కొందరైతే ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయకపోగా వారిని ఎగతాళి చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో అలాంటి వారికి ఏదో ఒక రూపంలో గుణపాఠం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానంలో చిన్న పిల్లాడి కారణంగా ఓ గర్భిణికి ఇబ్బంది పడింది. అయినా ఆ పిల్లాడి తల్లి పట్టించుకోలేదు. ఈ క్రమంలో వెనుక నుంచి ఆమెకు షాక్ తగిలిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ గర్భిణి ( pregnant woman) తన కుటంబ సభ్యులతో కలిసి విమానం (plane) ఎక్కుతుంది. అయితే లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చోగానే కాసేపటికి అసలు సమస్య మొదలవుతుంది. గర్భిణి వెనుక సీట్లో కూర్చున్న పిల్లాడు.. వెనుక నుంచి కాలితో తన్నుతూ సీటును పదే పదే కదిలిస్తాడు. ఆ తర్వాత కుర్చీ నుంచి పైకి లేచి (boy troubled the pregnant woman) గర్భిణి కూర్చున్న కుర్చీని ముందుకు, వెనక్కు ఊపుతాడు.

Viral video: నీటి గుర్రం పవరేంటో ఎప్పుడైనా చూశారా.. మూడు సింహాలను సైతం ఒక్కసారిగా..


అంతటితో ఆగని బాలుడు.. చివరకు ఆమె చేతిలో ఉన్న పేపర్ లాక్కుని కింద పడేస్తాడు. దీంతో ఓపిక నశించిన గర్భిణి.. పైకి లేచి పిల్లాడి తల్లికి చెబుతుంది. ‘‘మీ కొడుకును కొంచెం కంట్రోల్ చేయండి’’.. అని అంటుంది. దీంతో పిల్లాడి తల్లి ఒక్కసారిగా కోపం ప్రదర్శిస్తూ విసుక్కుంటుంది. పైగా తమ కొడుకు చేసినట్లుగా అతడి తల నిమురుతూ మెచ్చుకుంటుంది. దీంతో చేసేదేమీలేక గర్భిణి దిగాలుగా కుర్చీలో కూర్చుంటుంది. అయితే ఆ వెంటనే పిల్లాడి తల్లి వెనుక కూర్చున్న వ్యక్తి పైకి లేచి కుర్చీని గట్టిగా తోసేస్తాడు. దీంతో ఆమె చేతిలోని జ్యూస్ మొత్తం మీద పడుతుంది.

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


ఈ ఘటన చూసి గర్భిణి మహిళ నవ్వుతూ మురిసిపోతుంది. ఒకరిని ఇబ్బంది పెడితే.. తగిన శాస్తి వెంటనే అనుభవించకతప్పదు.. అనేలా అనిపిస్తున్న ఈ వీడియో సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సాటి మహిళ అయ్యుండి.. ఇలా పట్టించుకోకపోవడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘తగిన శాస్తి బాగా జరిగింది’’.. అంటూ మరికొందరు, ‘‘సమాజానికి మంచి సందేశం ఇచ్చారు’’... అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: నీళ్లలో రోడ్ డివైడర్స్.. సమీపానికి వెళ్లి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే సీన్..

Updated Date - Jun 29 , 2024 | 04:12 PM