Viral Video: ముసలోడే కదా అని తలుపులేసి తాళం వేశారు.. చివరకు ఏమైందో చూసి ఖంగుతిన్నారు..
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:58 PM
కొందరు చూసేందుకు సింపుల్‌గా ఉన్నా కూడా అమితమైన టాలెంట్‌ను కలిగి ఉంటారు. మరికొందరు వృద్ధాప్యంలోనూ అనితర సాధ్యమైన సహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వినూత్న విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధుడి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు..
కొందరు చూసేందుకు సింపుల్‌గా ఉన్నా కూడా అమితమైన టాలెంట్‌ను కలిగి ఉంటారు. మరికొందరు వృద్ధాప్యంలోనూ అనితర సాధ్యమైన సహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వినూత్న విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధుడి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే కొందరు ఆకతాయిలు తలుపులు వేశారు. అయితే చివరకు జరిగిన ఘటన చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ పెద్దాయన పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు (old man) చేతిలో దుస్తులు పట్టుకుని, స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్తాడు. అయితే అతన్ని ఆటపట్టించాలని కొందరు యువకులు అక్కడే దాక్కుని ఉంటారు. వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లగానే తలుపు మూసి గొళ్లెం వేసేస్తారు. అయితే తలుపు మూయగానే లోపల ఉన్న వృద్ధుడు వెంటనే తెరిచే ప్రయత్నం చేస్తాడు.
Viral Video: వీధుల్లోకి చొరబడ్డ సింహం.. పరుగులు తీసిన జనం.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
అయితే తలుపు రాకపోవడంతో అతడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. కాలి ఒక్క తన్ను తన్నడంతో (old man broke the door) తలుపు మధ్యలో పగిలిపోతుంది. ఆ తర్వాత చేయి బయటికి పెట్టి తాళం తీసుకుని బయటికి వస్తాడు. బయటికి వచ్చీ రాగానే.. ‘‘ఎవడ్రా.. తాళం వేసిందీ.. కనిపించే వెంటపడికొడతా’’.. అన్నట్లుగా కోపంగా చూస్తాడు. ఇలా గదిలో నుంచి తలుపు బద్ధలుకొట్టుకుని సినిమా తరహా ఎంట్రీ ఇచ్చిన ఈ వృద్ధుడిని చూసి అంతా షాక్ అయ్యారు.
Viral Video: అడవి దున్నతో పెట్టుకున్న సింహం.. చివరికి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పెద్దాయన పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తాత ఎంట్రీ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 1.67 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..