Share News

Viral Video: ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Dec 27 , 2024 | 07:10 PM

రైలు పట్టాలు దాటే క్రమంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బ్రిడ్జి పైనుంచి వెళ్లకుండా అడ్డదిడ్డంగా దాటే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తుంటాం. అయితే కొందరు మాత్రం ఎంతో లక్కీగా బయటపడుతుంటారు. ఇలాంటి..

Viral Video: ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
woman Survived Train Accident

రైలు పట్టాలు దాటే క్రమంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బ్రిడ్జి పైనుంచి వెళ్లకుండా అడ్డదిడ్డంగా దాటే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తుంటాం. అయితే కొందరు మాత్రం ఎంతో లక్కీగా బయటపడుతుంటారు. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రైలు దాటుతుండగా.. సడన్‌గా రైలు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతూ ఉంటుంది. ఈ క్రమంలో పట్టాల మధ్యలో ఉండగా.. సడన్‌గా గూడ్స్ రైలు దూసుకొస్తుంది. దీంతో ఆ యువతి పట్టాల మధ్యలో పడుకుండిపోతుంది. రైలు ఆమె మీదుగా (train ran over the young woman) వెళ్లిపోతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

Viral Video: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో.. కుక్కలను తప్పించుకోవాలని చూడగా.. చివరకు..


ఆ యువతికి ఏమైందో అని కంగారుపడతారు. ప్లాట్‌ఫామ్ సమీపంలో నిలబడి కిందకు చూస్తుంటారు. అయితే రైలు పూర్తిగా దాటిపోయిన తర్వాత చూడగా.. ఆశ్చర్యకరంగా ఆమె క్షేమంగా ఉంటుంది. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆమెలో ఎలాంటి భయమూ కనిపించదు. పైగా పైకి లేచి తన ప్రియుడితో మాటలను కొనసాగిస్తుంది. ఈమె నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: ముసలోడే కదా అని తలుపులేసి తాళం వేశారు.. చివరకు ఏమైందో చూసి ఖంగుతిన్నారు..


ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆమె ఓ మహిళ.. కాబట్టి ఏమైనా చేయగలదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నిద్ర లేచీ లేవగానే టీ కావాలని అరిచాడు.. అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2024 | 07:10 PM