Share News

Kodandaram: ఇరురాష్ట్రాల సీఎంల భేటీపై కోదండరాం ఏమన్నారంటే?

ABN , Publish Date - Jul 02 , 2024 | 02:49 PM

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఇరు ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

Kodandaram: ఇరురాష్ట్రాల సీఎంల భేటీపై కోదండరాం ఏమన్నారంటే?
Professor Kodandaram

హైదరాబాద్, జూలై 2: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Andhrapradesh CM Chandrababu) భేటీ అవనున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) స్పందించారు. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పదేండ్ల సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఏడుస్తున్నారని.. సమస్య ముగుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ప్రజల తరపున చర్చ చేయడం మంచి పరిణామమని ప్రొఫెసర్ వెల్లడించారు.

Surya Catch Row: క్యాచ్ వివాదం.. బౌండరీ లైన్‌ని వెనక్కు నెట్టారా.. అసలు నిజం ఇది!


చంద్రబాబు ఏపీ ప్రజల ప్రతినిధిగా, రేవంత్ తెలంగాణ ప్రజల ప్రతినిధిగా సమస్యలపై చర్చిస్తారన్నారు. ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవడం తప్ప వేరే మార్గమే లేదన్నారు. పబ్లిక్ రంగ సంస్థల ఆస్తుల పంపకం, నదీజలాలు, ఉద్యోగుల విభజన అంశాలపై ఒక పరిష్కారం దొరుకుతుందన్నారు. కలిసి మాట్లాడుకుంటే పదేండ్ల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గతంలో సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ కలిసి భోజనం చేశారు తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్చించలేదని కోదండరాం విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి....

TS News: ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే మహిపాల్

Harish Rao: చంద్రబాబు అత్యంత శక్తివంతుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేతిలోనే..

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 02 , 2024 | 03:10 PM