Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..
ABN , Publish Date - Jul 02 , 2024 | 01:57 PM
Salman Khan - Bishnoi gang: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నవీ ముంబై పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ పన్నిన కుట్రలను క్లియర్‌గా వివరించారు. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్..
Salman Khan - Bishnoi gang: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నవీ ముంబై పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ పన్నిన కుట్రలను క్లియర్‌గా వివరించారు. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ రూ.25 లక్షల కాంట్రాక్టు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. సల్మాన్‌ను హతమార్చేందుకు ఆధునిక ఆయుధాలు సమకూర్చేందుకు ప్లాన్ చేశారట.
ఏప్రిల్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో గల సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల మోటార్‌బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్ సమీపంలో సల్మాన్ ఖాన్‌పై దాడికి ఈ ముఠా ప్లాన్ చేసింది. అయితే, సల్మాన్‌ను చంపేందుకు విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు తెచ్చుకోవాలని బిష్ణోయ్ ముఠా ప్లాన్ చేసింది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాపై కాల్పులు జరిపిన జిగానా పిస్టల్‌తో(టర్కీలో తయారు చేసిన పిస్టల్) సల్మాన్‌ను హత్య చేయాలని ముఠా భావించిందని దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు.. సల్మాన్‌పై అటాక్ చేసేందుకు M16, AK-47, AK-92 రైఫిళ్లను కొనుగోలు చేయడానికి పాకిస్థాన్‌లోని ఆయుధ వ్యాపారితో టచ్‌లో ఉన్నట్లు నిందితులలో ఒకరు విచారణలో వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పులకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్, అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. 2023 సెప్టెంబర్-అక్టోబర్‌లో సల్మాన్‌పై దాడికి కుట్ర పన్నినట్లు పన్వెల్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు ఇన్‌పుట్‌లు అందాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ II (పన్వెల్) వివేక్ పన్సారే తెలిపారు. ఈ సమాచారం మేరకు నవీ ముంబై పోలీసులు బిష్ణోయ్ గ్యాంగ్ వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వారి చాట్‌ను, ప్లాన్స్‌ను ట్రాక్ చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్.. పన్వెల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్‌ను, ముంబైలోని బాంద్రాలోని అతని ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను, సినిమా షూటింగ్ స్పాట్‌లలో రెక్కీ నిర్వహించారు.