Share News

Puli Varthi Nani: పెద్దిరెడ్డి నాతో పెట్టుకోకు.. నీ బండారం బయటపెడతా.. పులివర్తి నాని మాస్ వార్నింగ్

ABN , Publish Date - Jan 30 , 2025 | 07:12 PM

Puli Varthi Nani: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెద్దిరెడ్డి విచక్షణ రహితంగా మాట్లాడితే చూస్తు ఊరుకోమని ఎమ్మెల్యే పులివర్తి నాని వార్నింగ్ ఇచ్చారు.

Puli Varthi Nani: పెద్దిరెడ్డి నాతో పెట్టుకోకు.. నీ బండారం బయటపెడతా..  పులివర్తి నాని  మాస్ వార్నింగ్
Puli Varthi Nani

చిత్తూరు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనవసరంగా నోరుపారేసుకుని పెద్దిరెడ్డి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(గురువారం) చిత్తూరులో పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి ఆక్రమణలకు సంబంధించిన నిజాలు ఒప్పుకోవాలని అన్నారు. పెద్దిరెడ్డి ఏ విధంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి మాటలు ఆయన అజ్ఞానానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు.


మంగళంపేట అటవీ ప్రాంతంలో వందల ఎకరాల భూములు పెద్దిరెడ్డికి ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క పెద్దిరెడ్డి కాదు చాలామంది వైసీపీ నాయకులు ఎలాంటి భూ అవినీతి ఆక్రమణలకు పాల్పడ్డారో తెలుసు అని వారి బండారం బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్లు వేయాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలియంది కాదని అన్నారు. అలాంటిది పెద్దిరెడ్డి భూములకు అటవీ ప్రాంతంలో కోట్లాది రూపాయల రోడ్లు వేసి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులతో పెద్దిరెడ్డి భూములకు రోడ్లు ఎలా వేసుకుంటారని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 07:13 PM