-
-
Home » Andhra Pradesh » Today Latest Breaking News and Live updates in Telugu 3rd January 2024 Amar
-
Today Breaking News: డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల ఆందోళన
ABN , First Publish Date - Jan 03 , 2025 | 10:29 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-03T13:30:05+05:30
కాకినాడ తీరానికి స్విమ్మర్ శ్యామల
కాకినాడ తీరానికి చేరుకున్న స్విమ్మర్ శ్యామల
ఆరు రోజులు సముద్రంలో ఈదుకుంటూ కాకినాడ చేరుకున్న శ్యామల
గత నెల 28న విశాఖ సముద్ర తీరం నుంచి స్విమ్మింగ్ మొదలు పెట్టిన శ్యామల
-
2025-01-03T13:19:01+05:30
డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారుల ఆందోళన
కామారెడ్డి కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కలెక్టరేట్ గేటు ముందు నిరసన
అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
-
2025-01-03T12:37:45+05:30
నంద్యాల జిల్లా వంగలిలో ఉద్రిక్తత
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత
పాల డైరీ ఎన్నికల నామినేషన్ విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం
పోలీసులు తీరుపై టీడీపీ వర్గీయుల అసహనం
ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు వైసీపీపకి మద్దతు పలుకుతున్నారని టీడీపీ వర్గీయులు అర్థనగ్న ప్రదర్శన
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
-
2025-01-03T12:11:17+05:30
అవయవదానంపై అవగాహన సదస్సు
అవయవదానంపై గుంటూరు వైద్య కళాశాలలో అవగాహన సదస్సు
సదస్సులో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయం- మంత్రి
ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తన్నాయన్న మంత్రి
అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని సత్యకుమార్ పిలుపు
పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
-
2025-01-03T11:08:58+05:30
జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జగన్ పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్య లు
జగన్‌కి సంబంధించిన ఒక రహస్యాన్నిచెబుతా
జగన్ మీద 11 కేసులు ఉండటంతో 11 అసెంబ్లీ సీట్లు గెలిచారు
జగన్ మీద ఇంకా ఎక్కువగా కేసులు ఉంటే ఎక్కువ స్థానాలు ఆ పార్టీకి వచ్చేవి ఏమో
వైసిపి ని ప్రజలు కోరుకోవడం లేదు. కాంగ్రెస్‌ను మాత్రమే కోరుకుంటున్నారు
డబ్బుల కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. వైసీపీని ప్రజలు పట్టించుకోవడం లేదు
ఎస్సీ వర్గీకరణ తొందర పాటు చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం
తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
వర్గీకరణ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి
కాంగ్రెస్ పార్టీ తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను చంద్ర బాబు నిలబెట్టాలి
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
దేశంలో అమిత్ షా రాజ్యాంగం అమలు అవుతోంది. అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు.
-
2025-01-03T10:29:12+05:30
మండపేటలో రేవ్ పార్టీ కలకలం
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవ్ పార్టీ వీడియోల కలకలం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఓ లేఅవుట్‌లో మహిళలతో అశ్లీల నృత్యాలు
నిర్వాహకులు పై కేసు నమోదు