Viral Video: మంచులో ఆటో స్టార్ట్ చేయాలని చూడగా డ్రైవర్‌కు షాక్.. చివరకు ఏమైందో మీరే చూడండి..
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:36 PM
మంచు కురిసే ప్రదేశాలు చూడటానికి ఆహ్లాదకరంగా అనిపించినా.. స్థానికులకు మాత్రం అనేక ఇబ్బందులు కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు మంచు దాటికి వాహనాలు గడ్డ కట్టుకుపోవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో వాటి యజమానులు అష్టకష్టాలెు పడాల్సి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
మంచు కురిసే ప్రదేశాలు చూడటానికి ఆహ్లాదకరంగా అనిపించినా.. స్థానికులకు మాత్రం అనేక ఇబ్బందులు కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు మంచు దాటికి వాహనాలు గడ్డ కట్టుకుపోవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో వాటి యజమానులు అష్టకష్టాలెు పడాల్సి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మనాలిలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచు కురిసే సమయంలో ఆటోను స్టార్ట్ చేయాలని చూడగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మనాలిలో (Manali snowfall) మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో స్థానికులతో పాటూ పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ ట్రాఫిక్ జామ్ (Traffic jam) కారణంగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
అయితే తాజాగా, మనాలిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను స్టార్ట్ చేయడానికి వెళ్లాడు. అయితే ఇలా డోరు తీసి కూర్చోవాలని చూడగానే.. మంచు కారణంగా ఆటో వెనక్కు జారుతూ వెళ్లింది. దీంతో అతను భయపడి వాహనం నుంచి దూరంగా వెళ్లిపోయాడు.
Viral Video: ఎడ్ల బండా మజాకా.. ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ.. చివరకు జరిగింది చూస్తే..
చూస్తుండగానే ఆ ఆటో వెనక్కు జారిపోతూ చివరకు రోడ్డు పక్కన (Auto that fell in the valley) ఉన్న లోయలో పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘మంచులో వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..