Viral Video: కూలీగా మారిన కోతి.. మహిళతో కలిసి ఏం చేస్తుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Jan 01 , 2025 | 09:44 PM
కోతులు కొన్నిసార్లు అతి తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులు చేసే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషులకు సాయం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కోతులు కొన్నిసార్లు అతి తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులు చేసే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషులకు సాయం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళతో కలిసి కోతి చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘కూలీగా మారిన కోతి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి చేస్తున్ని నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ మహిళ ఇంటి పనులు చేస్తుండగా.. కోతి సడన్‌గా లోపలికి వెళ్లింది. లోపలికి వెళ్లిన కోతి అక్కడున్న వస్తువులను తీసుకుని వెళ్లిపోతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా ఇంటి పనులు చేయడం స్టార్ట్ చేసింది. మహిళ చపాతీలు చేస్తుంటే.. కోతి పిండిని రుద్దుతోంది.
Viral Video: ఇది పీతా.. లేక ప్రేతాత్మా.. ఉడికించాలని చూడగా ఏం చేసిందో చూడండి..
ఆ తర్వాత వంట పాత్రలను (monkey cleaning cooking utensils) కూడా శుభ్రం చేసింది. ఇలా ఇంటి పనులన్నీ చేసిన తర్వాత ఆమె పెట్టిన ఆహారం తిని బుద్ధిగా నిద్రపోయింది. మళ్లీ పొద్దునే తలుపు తీసి పనిలోకి దిగిందన్నమాట. ఇలా చెట్టు కొమ్మలపై గెంతులేయాల్సిన కోతి.. అందుకు విరుద్ధంగా ఇంటి పనులన్నీ చేసి పెట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరెరే.. ఈ కోతి మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘రూట్ మార్చిన కోతి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 170కి పైగా లైక్‌లు, 22వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..