Viral Video: వామ్మో.. ఇదెక్కడి చోరీరా నాయనా.. స్వీటు షాపులో ఈమె చేస్తున్న నిర్వాకం చూడండి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:27 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న సంఘటన అయినా అందులో ఏమాత్రం కొత్తదనం ఉన్నా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తూ నెటిజన్ల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొందరు చేసే పనులు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న సంఘటన అయినా అందులో ఏమాత్రం కొత్తదనం ఉన్నా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తూ నెటిజన్ల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొందరు చేసే పనులు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ స్వీటు షాపులో స్వీట్లను చోరీ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదెక్కడి చోరీరా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్వీటు షాపులోకి వెళ్లిన ఓ మహిళ.. తనకు కావాల్సిన ఐటెమ్స్‌ను ఆర్డర్ చేస్తుంది. దీంతో షాపులోని వ్యక్తి వాటిని బయటికి తీసి, తూకం వేస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. అతను స్వీట్లు తీయడానికి కిందకు వంగగానే.. అక్కడున్న మహిళ తక్కెడలోని స్వీటును తీసుకుని నోట్లో వేసుకుంటుంది.
Viral Video: కొంపతీసి రైల్లో ఇలాగానీ చేస్తున్నారా.. ఫోన్‌కు వీళ్లెలా చార్జింగ్ పెడుతున్నారంటే..
పైకి లేచిన అతను బరువు తక్కువగా ఉండడంతో ఇంకో స్వీటు తీసుకునేందుకు కిందకు వంగుతాడు. దీంతో మళ్లీ ఆమె తక్కెడలోని స్వీటు తీసుకుని తింటుంది. ఇలా అతను కిందకు వంగిన ప్రతి సారీ ఆమె.. తక్కెడలోని స్వీట్లను తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ మహిళ విచిత్రంగా ( woman stole the sweet) చోరీ చేసిన విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.
Viral Video: యువకులకు షాకిచ్చిన యువతి.. బస్సు ఎలా ఎక్కుతుందో చూస్తే మీరు కూడా ఖంగుతింటారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో్.. ఈమె చోరీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గడ్డకట్టిన సరస్సుపై వాకింగ్.. సడన్‌గా మంచులో కూరుకుపోయిన పర్యాటకులు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..