Viral Video: యువకులకు షాకిచ్చిన యువతి.. బస్సు ఎలా ఎక్కుతుందో చూస్తే మీరు కూడా ఖంగుతింటారు..
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:11 PM
కొందరు యువతులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. చాలా మంది బస్సు, రైళ్లలో ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ తరహా..
కొందరు యువతులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. చాలా మంది బస్సు, రైళ్లలో ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి బస్సు ఎక్కే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈమేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు (Passengers) బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు అక్కడికి వచ్చి ఆగింది. దీంతో ఒక్కసారిగా అంతా బస్సులోకి ఎక్కేశారు. దీంతో వారి మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. అయినా ఎవరూ వెనక్కు తగ్గకుండా బస్సులోకి ఎక్కేశారు. బస్సు పూర్తిగా నిండిపోవడంతో.. డోరు వద్ద కూడా చాలా మంది ప్రమాదకరంగా వేలాడుతున్నారు.
Viral Video: గడ్డకట్టిన సరస్సుపై వాకింగ్.. సడన్‌గా మంచులో కూరుకుపోయిన పర్యాటకులు.. చివరకు..
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ యువతి.. ఎలాగైనా బస్సు ఎక్కాలని నిర్ణయించుంది. అయితే డోరు వద్ద అంతా వేలాడుతుండడంతో అవకాశం లేకుండా పోయింది. అయినా సరే ఆమె వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో బస్సు స్టార్ట్ అయింది. అయినా సరే ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి బస్సు కిటికీని పట్టుకుంది. కిటికీ పట్టుకుని (young woman hanging from the bus) వేలాడిన ఆమె.. ఆ తర్వాత కాలు లోపలికి పెట్టింది. లోపలికి దూరే అవకాశం లేకున్నా కూడా ఎలాగైనా సీటులో కూర్చోవాలనే ఉద్దేశంతో చిన్న సందులో నుంచే లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది.
Viral Video: గాలిపటం ఎగురవేస్తున్న కోతి.. మేడపై దాని నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఈమె ప్రమాదకర విన్యాసం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. ఈమేంటీ బస్సును ఇలా ఎక్కేసింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 4.51 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇండియన్ టాయిలెట్‌ను ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..