Share News

Viral Video: నీళ్లలో మునిగిన వ్యక్తి.. పైన మంట వెలిగించిన స్నేహితులు.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 07:42 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి విన్యాసాలు చూస్తే రోమాలు నిక్కబొడుచునేలా ఉంటాయి. ఇంకొన్ని విన్యాసాలు చూస్తే ప్రాణాలు పోయేంత పనవుతుంటుంది. తాజాగా..

Viral Video: నీళ్లలో మునిగిన వ్యక్తి.. పైన మంట వెలిగించిన స్నేహితులు.. చివరకు చూస్తే..
Dangerous Water Stunts Videos

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి విన్యాసాలు చూస్తే రోమాలు నిక్కబొడుచునేలా ఉంటాయి. ఇంకొన్ని విన్యాసాలు చూస్తే ప్రాణాలు పోయేంత పనవుతుంటుంది. తాజాగా, ఈ తరహా విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు నీళ్లలో చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. నీళ్లపై మంట వెలిగించి మరీ వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే మీరు కూడా షాకవుతారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు నీళ్లలో వినూత్న విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. నీళ్ల డ్రమ్ములోకి దిగిన ఆ వ్యక్తి స్నేహితుల సమక్షంలో అందులో మునిగాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు నీళ్లపై (Youths set fire to water) పెట్రోలు పోసి మంట వెలిగిస్తారు. మంటలు వ్యాపిస్తుండగా ఆ వ్యక్తి చాలా సేపు నీటిలోనే ఉండిపోతాడు. ఇలా కొన్ని నిముషాల తర్వాత ఒక్కసారిగా పైకి లేస్తాడు.

Viral Video: రోడ్డుపై డాన్స్ చేస్తూ రీల్ చేస్తున్న యువతి.. సడన్‌గా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి.. చివరకు చూస్తే..


అతను పైకి లేవగానే నీటిపై మంటలు ఆరిపోవడంతో ఎలాంటి గాయాలూ కాలేదు. ఇలా నీటిలో డేంజరస్ స్టంట్స్ (Dangerous Stunts) చేసిన ఈ వ్యక్తిని చూసి అంతా షాక్ అవుతున్నారు. గతంలో చాలా మంది ఇలా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను చూశాం. అయినా యువతలో మార్పు రావడం లేదు. వ్యూస్‌, లైక్‌ల కోసం ఇలా ప్రమాదకర విన్యాసాలు చేయడం సర్వసాధారణమైంది.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి చోరీరా నాయనా.. స్వీటు షాపులో ఈమె చేస్తున్న నిర్వాకం చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఈ స్టంట్ చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొంపతీసి రైల్లో ఇలాగానీ చేస్తున్నారా.. ఫోన్‌కు వీళ్లెలా చార్జింగ్ పెడుతున్నారంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 06 , 2025 | 07:42 PM