Viral Video: రోడ్డుపై డాన్స్ చేస్తూ రీల్ చేస్తున్న యువతి.. సడన్‌గా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:48 PM
ప్రస్తుతం చాలా వరకు యువతకు రీల్స్ చేయడం దినచర్యగా మారిపోయింది. ఏ పని మర్చిపోయినా కూడా రీల్స్ చేయడం మాత్రం మర్చిపోరు. కొందరైతే అన్ని పనులనూ పక్కన పెట్టి రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో యువతులు కూడా యువకులతో పోటీపడి మరీ రీల్స్ చేయడం చూస్తున్నాం. కొందరు అమ్మాయిలైతే..
ప్రస్తుతం చాలా వరకు యువతకు రీల్స్ చేయడం దినచర్యగా మారిపోయింది. ఏ పని మర్చిపోయినా కూడా రీల్స్ చేయడం మాత్రం మర్చిపోరు. కొందరైతే అన్ని పనులనూ పక్కన పెట్టి రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో యువతులు కూడా యువకులతో పోటీపడి మరీ రీల్స్ చేయడం చూస్తున్నాం. కొందరు అమ్మాయిలైతే.. నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో నడి రోడ్డుపై చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు యువతి రోడ్డుపై డాన్స్ చేస్తూ రీల్ చేస్తుండగా.. వెనుక నుంచి ఓ వ్యక్తి సడన్‌గా దూసుకొచ్చాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వినూత్నంగా రీల్ చేయాలనే ఉద్దేశంతో ఓ యువతి పొట్టి డ్రస్సులో రోడ్డు పైకి వచ్చింది. ఫోన్ కెమెరా ఆన్ చేసి నేలపై పెట్టింది. తర్వాత కాస్త దూరంగా నిలబడి (young woman danced on the road) డాన్స్ వేయడం స్టార్ట్ చేసింది. అయితే రెండు, మూడు స్టెప్పులు వేయగానే ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఇదెక్కడి చోరీరా నాయనా.. స్వీటు షాపులో ఈమె చేస్తున్న నిర్వాకం చూడండి..
ఓ వ్యక్తి పెద్ద అట్ట పెట్టెను ఎత్తుకుని వెనుకగా వచ్చి ఆమె తలపై బోర్లించి, గిరా గిరా తిప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అప్పటిదాకా ఆనందంగా డాన్స్ చేస్తున్నా అమ్మాయి.. సడన్‌గా కిందపడిపోతుంది. తర్వాత ఎలాగోలా దాన్నుంచి బయటికి వచ్చి.. ఆ వ్యక్తి కోసం అటూ, ఇటూ చూస్తూ వెతుకుతుంది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Viral Video: కొంపతీసి రైల్లో ఇలాగానీ చేస్తున్నారా.. ఫోన్‌కు వీళ్లెలా చార్జింగ్ పెడుతున్నారంటే..
అయితే చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం కావాలని ప్లాన్ చేసి తీసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘రోడ్లపై డాన్స్‌లు చేసే వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2800కి పైగా లైక్‌లు, 6.61 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: యువకులకు షాకిచ్చిన యువతి.. బస్సు ఎలా ఎక్కుతుందో చూస్తే మీరు కూడా ఖంగుతింటారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..