Viral Video: కొంపతీసి రైల్లో ఇలాగానీ చేస్తున్నారా.. ఫోన్‌కు వీళ్లెలా చార్జింగ్ పెడుతున్నారంటే..
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:19 PM
కొందరు నిర్లక్ష్యంలో చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. మరికొన్నిసార్లు కొందరు తెలిసి తెలిసి చేసే పనులు మిగతా వారికి ప్రాణాంతకంగా మారుతుంటాయి. బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ..
కొందరు నిర్లక్ష్యంలో చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. మరికొన్నిసార్లు కొందరు తెలిసి తెలిసి చేసే పనులు మిగతా వారికి ప్రాణాంతకంగా మారుతుంటాయి. బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో కొందరు తమ ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో ప్రయాణించే వారికి ఫోన్ చార్జింగ్ పెట్టుకునే (Phone charging in train) సదుపాయం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వారు కూడా రైల్లో చార్జింగ్ పెట్టుకున్నారు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్ల చార్జింగ్ పెట్టుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ‘‘లగేజీ పెట్టే స్థలంలో పడుకున్న ఓ వ్యక్తి తన ఫోన్‌కు చార్జింగ్ పెట్టాలని అనుకున్నాడు.
Viral Video: యువకులకు షాకిచ్చిన యువతి.. బస్సు ఎలా ఎక్కుతుందో చూస్తే మీరు కూడా ఖంగుతింటారు..
అయితే అక్కడ ఆ అవకాశం లేకపోవడంతో చివరకు వినూత్నంగా ఆలోచించాడు. అవతలి వైపు సీట్ల వద్ద ఉన్న ప్లగ్ నుంచి వైర్ కనెక్షన్ తీసుకున్నాడు. వైరును అవతలి వైపు నుంచి తాను పడుకున్న ప్రదేశం వరకూ తీసుకుని, అక్కడ ఓ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు దాని సాయంతో ఫోన్ చార్జింగ్ పెట్టుకున్నాడు. ఇలా ఆ వ్యక్తి ఫోన్‌కు ప్రమాదకరంగా చార్జింగ్ పెట్టడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేయడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
Viral Video: గడ్డకట్టిన సరస్సుపై వాకింగ్.. సడన్‌గా మంచులో కూరుకుపోయిన పర్యాటకులు.. చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా చేయడం వల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గాలిపటం ఎగురవేస్తున్న కోతి.. మేడపై దాని నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..