Funny Haircut Video: ఇలాక్కూడా కటింగ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:01 AM
హెయిర్ కటింగ్ వినూత్నంగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేందుకు బార్బర్లు కూడా తమదైన స్టైల్లో కటింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఇటు కస్టమర్లతో పాటూ అటూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా బార్బర కటింట్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌తో పాటూ ష్యాషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వీరి అభిరుచిని దృష్టిలో ఉంచకుని సెలూన్ నిర్వాహకులు కూడా యువతకు వివిధ రకాల హెయిర్ స్టైల్ చేయడం చూస్తున్నాం. ఈ క్రమంలో కొందరు బార్బర్లు వింత వింతగా కటింగ్ చేస్తూ నెట్టింట కూడా ఫేమస్ అవుతున్నారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కస్టమర్‌కు కటింగ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాక్కూడా కటింగ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. హెయిర్ కటింగ్ (Hair cutting) వినూత్నంగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేందుకు బార్బర్లు కూడా తమదైన స్టైల్లో కటింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఇటు కస్టమర్లతో పాటూ అటూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా బార్బర కటింట్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
కస్టమర్ సీట్లో కూర్చోగానే సెలూన్ నిర్వాహకుడు కటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఇతను అందరిలా ఒక కత్తెర పట్టుకోకుండా.. (Many Scissors) పదుల సంఖ్యలో కత్తెర్లను పట్టుకుని కటింగ్ చేశాడు. కస్టమర్ తలపై కొద్ది పాటి జుట్టు ఉండగా.. ఇతనేమో అంతకు మించి కత్తెరలను పట్టుకుని హెయిర్ కట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గరి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Marriage Funny Video: ఇది మామూలు ఎంట్రీ కాదు భయ్యో.. వరుడు ఎలా వస్తున్నాడో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతడి తలపై నాలుగు వెంట్రుకలు ఉంటే.. ఇతనేమో పదుల సంఖ్యలో కత్తెరలను పట్టుకున్నాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాక్కూడా హెయిర్ కట్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 6.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.