Share News

Bike Driving Viral Video: వీడి బైక్ డ్రైవింగ్ పిల్లాడి ప్రాణం మీదకు వచ్చిందిగా.. హ్యాండిల్‌కు బ్యాగు వేలాడదీసి మరీ..

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:37 PM

బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను అందరిలా బైక్ నడిపి ఉంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. అయితే ఇతను ఎలా డ్రైవ్ చేస్తున్నాడో మీరే చూడండి..

Bike Driving Viral Video: వీడి బైక్ డ్రైవింగ్ పిల్లాడి ప్రాణం మీదకు వచ్చిందిగా.. హ్యాండిల్‌కు బ్యాగు వేలాడదీసి మరీ..

సోషల్ మీడియాలో అనేక బైక్ డ్రైవింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు బైకును ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇంకొందరు ఐదు, ఆరుగురిని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు ప్రమాదర విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. అయితే తాజాగా, ఓ వ్యక్తి బైకు నడుపుతున్న సమయంలో చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైకు హ్యాండిల్‌కు వేలాడుతున్న బ్యాగును చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీడి బైక్ డ్రైవింగ్ పిల్లాడి ప్రాణం మీదకు వచ్చిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైక్ డ్రైవింగ్ (Bike driving) చేస్తున్న ఓ వ్యక్తిని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను అందరిలా బైక్ నడిపి ఉంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. అయితే ఇతను బైక్ డ్రైవింగ్ పిల్లాడి ప్రాణం మీదకు వచ్చి పడింది.

Viral Video: బీపీ మిషన్‌‌కు వింత పరీక్ష.. చివరకు ఎలాంటి ఫలితం వచ్చిందో చూడండి..


బైక్ హ్యాండిల్‌కు ఓ బ్యాగును తగిలించి, అందులో (Baby in the bag) పిల్లాడిని కూర్చోబెట్టాడు. తర్వాత యథావిధిగా బైకును నడుపుతూ వెళ్లాడు. ఇదేమీ తెలియని ఆ పిల్లాడు బ్యాగులో దిక్కులు చూస్తూ కూర్చొన్నాడు. ఈ సయయంలో ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పిల్లాడి ప్రాణాలకే ప్రమాదం. కానీ ఇతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా బైక్ నడుపుతూ వెళ్తున్నాడు. ఇతడి వింత నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఎక్కడ, ఎలా ఆపాలో కూడా తెలియాలి.. అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడి బైక్ డ్రైవింగ్ పిల్లాడి ప్రాణం మీదకు వచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గేటు మధ్యలో ఇరుక్కుపోయిన కారు.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 01:37 PM