Marriage Funny Video: ఇది మామూలు ఎంట్రీ కాదు భయ్యో.. వరుడు ఎలా వస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Mar 25 , 2025 | 08:17 AM
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరినీ తెగ నవ్విస్తోంది. మంటంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న వరుడు.. చివరకు కొత్తగా ఆలోచించాడు. బైకు, ట్రాక్టర్, గుర్రం.. వంటికి కాకుండా కాస్త రొటీన్‌గా ఆలోచించాడు. అతడు ఎంట్రీ ఇచ్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

సినిమాలో కనిపించే వింత వింత దృశ్యాలన్నీ.. నిజ జీవితంలో జరిగే పెళ్లిళ్లలో కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఏదోటి చేసి నెటిజన్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో వధూవరులు దగ్గరుండి మరీ తమ వివాహాన్ని విచిత్రంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లి మంటపంలోకి ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి ఘట్టాన్నీ సినిమా తరహాలో తీర్చిదిద్దుతున్నారు. కొందరు వధూవరులు అందరిలా కాకుండా.. బైకులు, ట్రాక్టర్లు, లగేజీ ట్రాలీల్లో మంటపంలోకి ఎంట్రీ ఇవ్వడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వరుడు పెళ్లి మంటపంలోకి రావడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘దీని ముందు సినిమా సీన్ దిగదుడుపే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరినీ తెగ నవ్విస్తోంది. మంటంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న వరుడు.. చివరకు కొత్తగా ఆలోచించాడు. బైకు, ట్రాక్టర్, గుర్రం.. వంటికి కాకుండా కాస్త రొటీన్‌గా జేసీబీని సెలెక్ట్ చేసుకున్నాడు.
Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..
జేసీబీకి బకెట్‌కు ముందు వైపు వేదికలా ఏర్పాటు చేసి, దానిపై పూలతో అలంకరించాడు. తర్వాత బకెట్ మధ్యలో వరుడు కూర్చోగా.. రెండు వైపులా బంధువులు కూర్చొన్నారు. ఇలా మొత్తం సెట్ చేశాక.. జేసీబీపై రాయల్‌గా(Groom enters wedding hall on JCB) మంటపంలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎవరూ ఊహించని విధంగా వరడు ఇలా జేసీబీపై రావడాన్ని చూసి అంతా తెగ నవ్వకున్నారు.
Viral Video: బాత్‌రూంలోకి వెళ్లే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
అంతా అతన్ని ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’. అంటూ కొందరు, ‘‘ఇది మామూలు ఎంట్రీ కాదు భయ్యో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 39 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..