Viral Video: గేటు మధ్యలో ఇరుక్కుపోయిన కారు.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..
ABN , Publish Date - Mar 25 , 2025 | 10:32 AM
ఓ వ్యక్తి తన ఇంటి గేటును వినూత్నంగా తయారు చేసి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాడు. దూరం నుంచి చూడగా.. గేటు మధ్యలో కారు ఇరుక్కుపోయినట్లుగా కనిపించింది. తీరా తగ్గరికి వెళ్లి చూస్తే.. అతడి పనితనం కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘నీ తెలివికి హ్యాట్సాప్ బ్రో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఒక పనిని అంతా ఒకేలా చేస్తే అది రొటీన్. అదే పనిని కాస్త కొత్తగా చేస్తే అది వెరైటీ.. అలాగే ఆ పనికి ఇంకాస్త సృజనాత్మకతను జోడించి చేస్తే.. అది అద్భుతం అవుతుంది. ఇలాంటి పనులు చూసే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అంతా ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేస్తే ఓ వ్యక్తి ఇనుప పార, కుక్కర్ ఇలా విచిత్రంగా చేయడం చూశాం. అంతా వాషింగ్ మెషిన్‌తో దుస్తులు ఉతికితే.. కొందరు సైకిల్ చక్రం, ప్లాస్టిక్ డ్రమ్ములకు మోటారు జాయింట్ చేసి ఉతకడం చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు గేటు మధ్యలో ఇరుక్కుపోయినట్లు కనిపించింది. అయితే తీరా దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘సృజనాత్మకత అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి గేటును వినూత్నంగా తయారు చేసి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాడు. దూరం నుంచి చూడగా.. గేటు మధ్యలో కారు ఇరుక్కుపోయినట్లుగా కనిపించింది. తీరా తగ్గరికి వెళ్లి చూస్తే.. అతడి పనితనం కనిపించింది.
కారు టైర్లతో పాటూ కారు డోర్లను కలిపి కారులా కనిపించేలా సెట్ చేశాడు. దాన్ని గేటు మధ్యలో (Car in middle of the gate) అమర్చాడు. ఫైనల్‌గా బటన్ ప్రెస్ చేయగా కారు టైర్లు దొర్లుతూ .. గేటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండేలా ఏర్పాట్లు చేశాడు. అలాగే కారు డోరు తీసి, బయటికి వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశాడు. దీన్ని చూసిన వారికి గేటను కారు మోస్తుందేమో అనుకునేలా సెట్ చేశాడు.
Marriage Funny Video: ఇది మామూలు ఎంట్రీ కాదు భయ్యో.. వరుడు ఎలా వస్తున్నాడో చూడండి..
ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కారు లాంటి గేటు’’.. అంటూ కొందరు, ‘‘సృజనాత్మకత అంటే ఇదే.. నీ తెలివికి హ్యాట్సాప్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.31 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..